స్వదేశీ ఎంఆర్ఎన్ఏ టీకా వచ్చేసింది

స్వదేశీ టీకాల ద్వారా ఇప్పటికే భారత్ కరోనా మహమ్మారిపై పెద్ద యుద్ధాన్ని చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త టీకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తోంది. ఇక భారత్ లో తొలి ఎంఆర్ఎన్ఏ టీకా రూపుదిద్దుకుంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు మంచి బూస్టర్ వ్యాక్సిన్లు అనే విషయాన్ని ఇప్పటికే పలువురు నిపుణులు తెలిపారు. పూణెకు చెందిన జెన్నోవా కంపెనీ స్వదేశీ ఎంఆర్ఎన్ఏ టీకాను రూపొందించింది. ఆ టీకా మూడవ దశ ట్రయల్స్ కూడా ముగిశాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ లేదా ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా.. వైరస్‌లోని జన్యువును తీసుకుని, దాని నుంచి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే టీకాను తయారు చేస్తారు. అతి స్వల్పమైన జన్యు పదార్థంతో.. కరోనా వైరస్‌లో ఉండే ప్రోటీన్ల తరహాలో మానవ కణాలను వృద్ధి చేసి, ఇమ్యూనిటీ వ్యవస్థను దృఢపరుస్తాయి. అమెరికాకు చెందిన హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్‌తో కలిసి జెన్నోవా కంపెనీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ క్యాండిటేట్ను(HGCO19) అభివృద్ధి చేసింది. డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు రూపొందిన రెండు డోసుల ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌కు కూడా జెన్నోవా మూడవ దశ ట్రయల్స్ పూర్తి చేసింది. దీనిపై భారత డ్రగ్స్ రెగ్యూలటరీ సంస్థ దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఓమిక్రాన్ వేరియంట్ కోసం mRNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని త్వరలో సమర్థత, రోగనిరోధక శక్తి కోసం మానవులపై పరీక్షించబడుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. mRNA వ్యాక్సిన్లు న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్ల వర్గానికి చెందినవి, ఇవి వ్యాధిని కలిగించే వైరస్ లేదా వ్యాధికారక నుండి జన్యు పదార్థాన్ని శరీరంలోకి వ్యతిరేకంగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించడానికి పనిచేస్తాయి. ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశపు మొట్టమొదటి mRNA (మెసెంజర్ RNA) వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ ను త్వరలో ప్రారంభించబోతోంది. ట్రయల్స్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని పలువురు అధికారులు సెబుతున్నారు. జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ mRNA వ్యాక్సిన్ దశ II డేటాను సమర్పించింది. దశ III డేటా కోసం రిక్రూట్‌మెంట్‌ను కూడా పూర్తి చేసింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసి) త్వరలో డేటాను సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.