జంతువులకూ కరోనా వ్యాక్సిన్..! తొలి దేశీయ టీకా ఇదే..!!

0
710

ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేసిన కరోనా మహమ్మారి జంతువులకు కూడా సోకే ప్రమాదం ఉందని, ఇప్పటికే కొన్ని జంతువుల్లో కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడ్డాయి కూడా. అయితే.. జంతువుల కోసం తొలి దేశీయ కరోనా టీకా వచ్చేసింది.

హర్యానాకు చెందిన ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ జంతువుల కోసం అభివృద్ధి చేసిన దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ కొవిడ్ టీకా ‘అనోకోవ్యాక్స్’ను వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నిన్న ప్రారంభించారు. ఈ వ్యాక్సిన్స్ కరోనా వైరస్‌లోని డెల్టా వేరియంట్‌తోపాటు ఒమిక్రాన్‌ను కూడా సమర్థంగా అడ్డుకుంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తెలిపింది.

శునకాలు, సింహాలు, చిరుతలు, ఎలుకలు, కుందేళ్లను కరోనా వైరస్ నుంచి ఈ వ్యాక్సిన్ రక్షిస్తుందని తెలిపారు. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకోవడం కంటే సొంతంగా అభివృద్ధి చేయడం నిజంగా పెద్ద విజయమని మంత్రి తోమర్ అన్నారు. అనోవ్యాక్స్‌తోపాటు సీఏఎన్-సీవోవీ-2 ఎలీసా కిట్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. దీని ద్వారా న్యూక్లియోకాప్సిడ్ ప్రొటీన్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఫలితంగా శునకాల్లో యాంటీబాడీలను గుర్తించొచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here