More

  బీబీసీపై భగ్గుమన్న భారతీయులు..! మోదీ డాక్యుమెంటరీ పై బ్రిటన్ లో భారీ నిరసనలు..!

  BBC డాక్యుమెంటరీపై చెలరేగిన వివాదం ఇప్పటికీ సమసిపోలేదు. దీనిని వ్యతిరేకిస్తూ నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రిటన్ లో ప్రవాస భాయతీయులు డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. బీబీసీ,.. బ్రిటన్ కు చెందిన వార్తా సంస్థ కావడంతో ఈ నిరసనలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లండన్ లోని బీబీసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనలు జరిగాయి. ఇందులో బీబీసీ, ప్రజలు కట్టిన పన్నులను వృధా చేస్తోందని నిరసనకారులు తెలిపారు. బీబీసీని బ్రిటిష్ బయాస్ కార్పొరేషన్ అనీ,.. ఇది భారత వ్యతిరేక ఛానెల్ అనీ పలువురు విమర్శించారు. కేవలం లండన్ లోనే కాకుండా Birmingham, Manchester, Glasgov, New Castel నగరాల్లో కూడా ఈ నిరసనలు జరిగాయి. ప్రవాస భారతీయులు పెద్దయెత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తీసే సమయంలో బీబీసీ వార్తా సంస్థ ఎటువంటి విలువలూ పాటించలేదని విమర్శించారు. ఈ కథనం అంతా ఏకపక్షంగా ఉందన్నారు. దీనిపై స్థానిక హిందూ సంస్థలు కూడా ఒక లేఖ రాశాయి. రెండు పేజీల ఈ లేఖలో డాక్యుమెంటరీని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై తమతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని లేఖలో తెలిపాయి. ఇక ఈ నిరసనల్లో ముస్లింలు కూడా పాలు పంచుకోవడం విశేషం. బీబీసీ తీసిన డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ ప్రవాస భారతీయులు కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

  ఇక కొన్ని రోజుల క్రితం బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయింది. 2002 గుజరాత్ అల్లర్లను ఆధారంగా చేసుకుని ఈ డాక్యుమెంటరీని తీసారు. ఈ అల్లర్లకు ప్రధాని మోదీయే కారణం అని బీబీసీ పేర్కొంది. ఇందులో ముస్లింలను టార్గెట్ గా చేసుకుని ఈ అల్లర్లను ప్రేరేపించారని పేర్కొంది. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు ఏవీ లేవు. కేవలం బ్రిటన్ వ్యక్తులు చేసిన ఇన్వెస్టిగేషన్ లో తేలిందని మాత్రమే పేర్కొంది. కానీ, ఇప్పటికే భారత న్యాయస్థానాలు దీనిపై మోదీకి క్లీన్ చిట్ ఇచ్చాయి. ఈ అల్లర్లలో అప్పటి సీఎంగా ఉన్న మోదీకి ప్రత్యక్ష పాత్ర లేదనీ,.. మోదీ నిర్దోషి అనీ తేల్చాయి. భారత్ లోని న్యాయస్థానాలు పూర్తిగా స్వతంత్రమైనవి. ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేస్తాయి. పూర్తి విచారణ తర్వాత వెలువరించిన తీర్పులో మోదీ నిందితుడు కాదని పేర్కొన్నాయి. కానీ, బీబీసీ మాత్రం దీన్ని ఇప్పటికీ వక్రీకరించే ప్రయత్నమే చేసింది. మోదీయే ప్రధాన నిందితుడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని, ముస్లింల వ్యతిరేకి అని చెబుతూ భారతీయ ముస్లింలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కారణాలతో తీసిన డాక్యుమెంటరీని దేశ ప్రభుత్వం ఇప్పటికే భారత్ లో నిషేధించింది. అయితే, JNU సహా దీన్ని పలు యూనివర్శిటీల్లో విద్యార్థి సంఘాలు అక్రమంగా ప్రదర్శించేందుకు ప్రయత్నించాయి. దీంతో ఆయా విద్యార్థులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు.

  ఇక డాక్యుమెంటరీ మోదీకి వ్యతిరేకంగా ఉందన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ, బీబీసీని తన భుజాలకెత్తుకుంటోంది. నిషేధించిన డాక్యుమెంటరీకి చెందిన లింక్ లను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రచారం కల్పిస్తోంది. దీంతో ఆ పార్టీ యువనేత మాజీ రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ రాజీనామా చేశారు. బీబీసీ దేశ వ్యతిరేక కథనాలు రాస్తోందనీ,.. అటువంటి వార్తా సంస్థను సమర్థించే కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగలేనని చెబుతూ తన రాజీనామా సమర్పించారు.

  Trending Stories

  Related Stories