More

    మరోసారి హెచ్చరికలు.. విడిచిపెట్టి వచ్చేయండి

    ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు భారత ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఉన్నపళంగా ఉక్రెయిన్ ను వీడాలని అందులో సూచించింది. అందుబాటులో ఏ వాహనం ఉంటే అందులో వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో.. రష్యా దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, భారతీయులు వెంటనే దేశం విడిచిపెట్టాలని సూచించింది. బార్డర్ల దగ్గరికి చేరుకోవడానికి, బార్డర్లు దాటేందుకు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ తెలిపింది. ఈ నెల 19న జారీ చేసిన మొదటి అడ్వైజరీలో భారతీయులు దేశం వీడేందుకు అవసరమైన మార్గాలను సూచించింది. ఉక్రెయిన్‌- హంగేరి, ఉక్రెయిన్‌- స్లోవేకియా, ఉక్రెయిన్‌- మాల్డోవా, ఉక్రెయిన్‌- పోలాండ్‌, ఉక్రెయిన్‌- రొమేనియా సరిహద్దుల నుంచి దేశం దాటొచ్చని సూచించింది. గతంలో భారత ప్రభుత్వం అక్కడి ఇండియన్స్ ను ప్రత్యేక విమానాల ద్వారా తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే..! పరిస్థితులు సద్దుమణుగుతూ ఉన్నాయని.. రెండు, మూడు నెలల క్రితం భారత విద్యార్థులు మరోమారు ఉక్రెయిన్ వెళ్లారు. ఈలోపు రష్యా దాడులు తీవ్రం చేయడంతో అక్కడున్న విద్యార్థులకు ఏమవుతుందా అనే ఆందోళన మొదలైంది. దీంతో ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ఈ నెల 19న ఉక్రెయిన్ వీడాలని సూచించింది. ఇప్పుడు మరోసారి కూడా సూచనలను జారీ చేసింది.

    Trending Stories

    Related Stories