More

    అమెరికాలో ఉద్యోగాలను పోగొట్టుకున్న వాళ్లకు డ్రీమ్ 11 నుండి పిలుపు

    పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలను కోల్పోతున్న భారతీయులు చాలా మందే ఉన్నారు. విదేశాలకు వెళ్లి ప్రముఖ టెక్ సంస్థలలో ఉద్యోగాలు చేయాలని అనుకున్న వారికి మొండి చేయి చూపిస్తున్నారు. జాబ్ లో జాయిన్ అయిన రెండు మూడు రోజులకే ఉద్యోగాల నుండి తీసేశారు. ట్విట్టర్ 3,800 మందిని, మెటా కూడా 11,000 మందిని తీసేసింది. గూగుల్, అమెజాన్ సంస్థలు కూడా కొత్తగా జాబ్స్ ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. దీంతో హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అమెరికాలో వలస నిబంధన కింద 60 రోజుల పాటు వరుసగా ఉపాధి లేకపోతే విదేశీయులు తమ స్వదేశాలకు వెళ్లిపోవాలి. వారు హెచ్1బీ వీసా కోల్పోతారు. దీంతో 60 రోజుల్లోపు మరో ఉద్యోగం సంపాదించాల్సిందే.

    అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలపై డ్రీమ్11 సీఈవో, సహ వ్యవస్థాపకుడు హర్ష జైన్ స్పందించారు. స్వదేశానికి తిరిగొచ్చి, భారత టెక్నాలజీ కంపెనీల ఎదుగుదలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఇటీవల 52,000వేలకు పైనే తొలగింపులు జరిగాయి. స్వదేశానికి వచ్చి వచ్చే దశాబ్ద కాలంలో భారత టెక్ కంపెనీల అధిక వృద్ధిలో భాగస్వాములు కావాలని హర్ష జైన్ పేర్కొన్నారు. అమెరికా లో ఉద్యోగాలు కోల్పోయిన బాధితులకు తాము అండగా నిలుస్తామని జైన్ ప్రకటించారు. గొప్ప నైపుణ్యాలున్న వారి కోసం భారత్ కంపెనీలు ఎప్పుడూ అన్వేషిస్తుంటాయని చెప్పారు.

    Trending Stories

    Related Stories