National

గాల్వాన్ ఘటన తర్వాత చైనా వస్తువులను దూరం పెట్టిన భారతీయులు

గత ఏడాది గాల్వాన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ ఘటన తర్వాత పెద్ద ఎత్తున భారత్ లో చైనా వస్తువులను కొనకూడదనే నిర్ణయానికి ఎంతో మంది వచ్చారు. చైనా వస్తువులను వాడకుండా ఉండాలని సోషల్ మీడియాలో క్యాంపెయిన్ లు నడిచాయి. చాలా మంది చైనా వస్తువులను ఇకపై కొనమని ప్రతిజ్ఞ పూనారు. అలా చేయడం వలన చైనాను ఆర్థికంగా దెబ్బ తీయవచ్చు. అందుకే చైనా వస్తువులను కొనకూడదని నిర్ణయించుకుని.. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లలో నిర్వహించిన ఒక సర్వేలో, గత ఏడాది గాల్వాన్ లోయ ఘర్షణల తరువాత.. చైనాలో తయారైన ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేయకుండా 43 శాతం మంది భారతీయులు దూరంగా ఉన్నారు. చైనా తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారిలో, వారిలో 60 శాతం మంది ఈ కాలంలో కేవలం ఒకటి రెండు వస్తువులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ సర్వేలో దేశంలోని 281 వివిధ జిల్లాలకు చెందిన 18,000 మంది వినియోగదారులు పాల్గొన్నారు. ‘మేడ్ ఇన్ చైనా’ ఉత్పత్తుల కొనుగోలుదారులలో మరో 70 శాతం మంది డబ్బు మిగిలించుకోవడానికి మాత్రమే పొరుగు దేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపారు.

2020 నవంబర్ సమయంలో 71 శాతం మంది భారతీయ వినియోగదారులు చైనా ఉత్పత్తులను కొనడం మానేశారు. పండుగల సమయాల్లో కూడా చైనా ఉత్పత్తులకు దూరంగా ఉన్నారట..! చాలా వరకూ దేశ ప్రజలు గాల్వాన్ ఘటన తర్వాత చైనాకు చెందిన వస్తువులను కొనకూడదని నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరకు చైనాలో తయారైన వస్తువులు దొరుకుతూ ఉన్నా కూడా భారత్ కు చెందిన వినియోగదారులు వాటిని కొనకుండా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇదే విధంగా మేడిన్ చైనా ఉత్పత్తుల బహిష్కరణ కొనసాగితే రాబోయే కాలంలో చైనాకు ఆర్థికంగా కూడా భారత్ చెక్ చెప్పే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eleven + 20 =

Back to top button