International

కెనడా రక్షణమంత్రిగా భారత సంతతి మహిళ అనిత

భారత సంతతికి చెందిన కెనడియన్ రాజకీయవేత్త అనితా ఆనంద్ అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. కెనడా క్యాబినెట్ ను పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ ను నియమించారు. ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగారు. సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన వైఖరి పట్ల విమర్శలు రావడంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్ కు అప్పగించారు. సజ్జన్ ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు. లిబరల్ పార్టీ ముందస్తు ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన ఒక నెల తర్వాత సైనిక సంస్కరణల కోసం పిలుపునిచ్చింది.

54 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెలలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓక్‌విల్లే నుంచి 46 శాతం ఓట్లతో గెలుపొందారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉన్నది. దీంతో లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆర్మీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అనితను రక్షణ మంత్రిగా ఎంపికచేశారు. కార్పొరేట్ లాయర్ గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. కెనడియన్ సైన్యంలో మార్పులు తీసుకుని రావడానికి, లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను నిరోధించడానికి మెరుగైన వ్యవస్థలను రూపొందించడానికి తీవ్రమైన ప్రజా మరియు రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనితా ఆనంద్ బాధ్యతలను చెప్పారు.

Related Articles

Back to top button