శ్రీలంకలో భారత వీసా కేంద్రం డైరెక్టర్‌ పై దాడి

0
781

శ్రీలంకలో భారత ప్రభుత్వ సీనియర్ అధికారిపై దాడి జరగడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. భారత వీసా కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న వివేక్‌వర్మపై సోమవారం రాత్రి కొలంబో సమీపంలో దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్టు భారత హైకమిషన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపింది. ఈ దాడి ఘటనను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శ్రీలంకలోని భారతీయులు తాజా పరిణమాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని భారత హైకమిషన్ సూచించింది. అత్యవసర సమయాల్లో తమను సంప్రదించాలని కోరింది.

తాజా పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకలోని తమ పౌరులను భారత్ మంగళవారం హెచ్చరించింది. వీసా కేంద్రంలో పని చేస్తున్న భారతీయుడికి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడికి గాయాలు అయ్యాయి. సోమవారం రాత్రి కొలంబో సమీపంలో జరిగిన దాడిలో వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మకు తీవ్రమైన గాయాలయ్యాయని భారత హైకమిషన్ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. వర్మ తన చేతికి కట్టుతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలు కానీ, దాడికి పాల్పడిన వ్యక్తుల వివరాలు కానీ వెంటనే అందుబాటులో లేవు.