డ్రాగన్ కు దడ పుట్టిస్తున్న బ్రహ్మోస్ ER.. అడ్డుకునే మార్గం లేక చైనా ఆందోళన..!

0
95

బ్రహ్మోస్ మొదటి వర్షన్ ని విజయవంతంగా పరీక్షించినపుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు భారత్ ని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే భారత్ లాంటి పెద్ద దేశానికి 280 KM దూరం వెళ్లి టార్గెట్ ని పిన్ పాయింట్ యాక్యురేసితో కొట్టే సూపర్ సానిక్ మిసైల్ ఉండడం మంచిదే అయినా అది పాకిస్తాన్ ని దెబ్బతీయడానికి మాత్రమే పనికి వస్తుంది. అదీ సరిహద్దుల దగ్గర నుండి ప్రయోగించాలి అనే అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో మోహరించడం వలన శత్రువు కంటపడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి కనీసం 500 km రేంజ్ ఉంటే అప్పుడు పశ్చిమ దేశాలకు, చైనాకు సవాల్ విసిరినట్లుగా ఉంటుంది అని వ్యాఖ్యానించారు.

వాళ్ళు చేసిన విమర్శ అసంతృప్తితో చేసిందే కానీ భేదభావంతో చేసింది కాదు. 2021 లో బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ వెర్షన్ అయిన బ్రహ్మోస్ NGని సుఖోయ్ Su-30 MKI తో అనుసంధానం చేసి ప్రయోగించినపుడు హర్షం వ్యక్తం చేశారు. అవసరం అయితే సరిహద్దు దాటి గంటకు 1800 km వేగంతో ప్రయాణిస్తూ బ్రహ్మోస్ NGని ప్రయోగించి అదేవేగంతో తిరిగి మన సరిహద్దులలోకి వచ్చేయవచ్చు. చాలా ఎత్తు నుండి ప్రయోగించడం వలన బ్రహ్మోస్ కి భూమ్యాకర్షణ తోడవడంతో వేగంతో పాటు రేంజ్ కూడా 50 KM పెరుగుతుంది. కానీ బ్రహ్మోస్ ER రేంజ్ వచ్చేసి 500 KM. అవును.. మూడేళ్లు తిరక్కుండానే వెస్ట్రన్ విశ్లేషకులను డిఆర్డీఓ ఆశ్చర్యపరిచింది.

తాము మరో రెండేళ్లు అంటే 2026 కి మొదటి ట్రయల్ ఉంటుంది అనుకున్నాము కానీ ముందే వచ్చేసింది అని వాపోయారు. ఈనెల 10 తారీఖున ఏకంగా ఆర్మీలో ప్రవేశపెట్టడానికి గాను అండమాన్ దీవుల నుండి పరీక్షించిన ఆర్మీ సంతృప్తిని వ్యక్తం చేసింది. రాడార్ కు దొరక్కుండా 500 km దూరం వెళ్లి దాడి చేయడం అనేది నిజంగా గేమ్ చేంజర్. లడాక్ నుండి ప్రయోగిస్తే టిబెట్ లోని జిన్ జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న చైనా ఎయిర్ బేస్ ల మీద దాడిచేయగల సత్తా ఇప్పుడు మనకి వచ్చేసింది. అదే బ్రహ్మోస్ ER ఎయిర్ లాంచ్ వర్షన్ SU 30 నుండి అయితే పని ఇంకా సులభం అవుతుంది. అయితే బ్రహ్మోస్ విషయంలో చైనా దగ్గర కూడా సమాధానం లేదు.

మరి చైనా దగ్గర ఉన్న S-400 ఎయిర్ డిఫెన్స్ ఏమీ చేయలేదా? ప్రతీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంకు రెస్పాండ్ అయ్యే సమయం అనేది ఉంటుంది. రెస్పాండ్ అయ్యే సమయం ఆయా ఎయిర్ డిఫెన్స్ సిస్టంల మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో ఆటోమాటిక్, మాన్యువల్ అని రెండు రకాల మోడ్ లు ఉంటాయి. మాన్యువల్ మోడ్ లో కమాండ్ సిస్టం మీద ఆపరేటర్స్ ఉంటారు. వీళ్ళు నిత్యం రాడార్ ని పర్యవేక్షిస్తూ ఉంటారు. ఒకవేళ రాడార్ మీద ఏదన్నా ఆబ్జెక్టు కనపడితే వెంటనే ట్రాక్ చేయడం మొదలు పెడతారు.

వచ్చేది ఫ్రెండా లేక శత్రువా అని తెలుసుకున్నాక మిసైల్ ఫైర్ చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 8 నుండి 12 సెకన్ల సమయం పడుతుంది. మామూలు సబ్ సానిక్ క్రూయిజ్ మిసైల్ కు అయితే 12 సెకన్ల సమయం తీసుకొని కూల్చేయవచ్చు. కానీ మాక్ 3 లేదా 4 స్పీడ్ తో వెళ్లే బ్రహ్మోస్ ని కూల్చాలి అంటే అది 4 సెకన్లలో చేయాలి. కానీ డిటెక్ట్ చేయడానికి 3 సెకన్లు, దానిని ట్రాక్ చేయడానికి 3 సెకన్లు, ఫైర్ కంట్రోల్ రాడార్ కు ఆర్డర్ ఇవ్వడానికి 4 సెకన్ల సమయం పడుతుంది. ఆ తరువాత ఫైర్ చేసినా ఉపయోగం ఉండదు. అప్పటికే బ్రహ్మోస్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక రష్యా బ్రహ్మోస్ ER ల కోసం ఎదురు చూస్తున్నది. బహుశా వచ్చే వారం ఆర్డర్ చెయ్యచ్చు. బ్రహ్మోస్ లో రష్యాకి 48% స్టేక్ ఉంది.

బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచేందుకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగించింది. ఈ క్షిపణిని భూమి, గాలి, నీటి నుంచి ప్రయోగించవచ్చు. ఇది గాలిలో తన మార్గాన్ని మార్చుకోగలదు. అంతేకాదు కదిలే లక్ష్యాలను చేధించగలదు. బ్రహ్మోస్ క్షిపణి పరిధిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 500 కి.మీలకు పెంచింది. దీంతో బ్రహ్మోస్ పరిధిలోకి చైనా, పాకిస్తాన్‌లోని అనేక నగరాలు వచ్చాయి. ఈ క్షిపణి పొడవు 28 అడుగులు. కాబట్టి ఇది 3000 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. అంతేకాకుండా ఈ క్షిపణి 200 కిలోల వరకు అణు వార్‌హెడ్‌లతో కూడా లోడ్ చేసుకోగలదు.

ఇక బ్రహ్మోస్ అనే పేరు భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర, రష్యాకు చెందిన మోస్క్వా అనే రెండు నదుల పేర్ల నుంచి పెట్టారు. డిఆర్డీవో, రష్యన్ ఫెడరేషన్ సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్‌ను తయారు చేశారు. ఈ బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణి. ఇది తొలిసారిగా 24 నవంబర్ 2020న అండమార్-నికోబార్ దీవులలో పరీక్షించబడింది. బ్రహ్మోస్ క్షిపణిని చైనాకు వ్యతిరేకంగా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లో మోహరిస్తారు. మొత్తంగా గత వారం డిఆర్డీఓ ప్రయోగించిన బ్రహ్మోస్ ఇప్పుడు చైనాకు సవాల్ గా మారింది. దానిని ఎదుర్కోవడం ఎలా అని చైనా తెగ కంగారు పడుతోంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seven + sixteen =