More

    అతడిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం 5.50 కోట్లు ప్రకటించింది.. ఢిల్లీలో దొరికాడు

    2018లో ఆస్ట్రేలియన్ మహిళను హత్య చేసిన కేసులో నిందితుడైన రాజ్‌విందర్ సింగ్‌ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు శుక్రవారం నాడు నవంబర్ 30 వరకు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన నర్సు సింగ్‌ను అరెస్టు చేశారు. ఆస్ట్రేలియా పోలీసు బలగాలు, భారత్ లోని ప్రభుత్వ సంస్థల మధ్య నాలుగు సంవత్సరాల పాటూ సుదీర్ఘ ప్రయాణం సాగింది.. ఎట్టకేలకు రాజ్‌విందర్ సింగ్‌ను అరెస్టు చేశారు.

    ఆస్ట్రేలియాలో హత్యారోపణలు ఎదుర్కొంటూ భారత్ కు పారిపోయి వచ్చిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వయసు 38 సంవత్సరాలు. ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫాయిల్ లో నర్సుగా పనిచేసేవాడు. స్వస్థలం పంజాబ్ లోని బట్టర్ కలాన్. 2018లో ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో టోయా కార్డింగ్లే అనే 24 ఏళ్ల యువతి బీచ్ వద్ద హత్యకు గురైంది. టోయా ఓ ఫార్మసీలో పనిచేసేది. క్వీన్స్ లాండ్ లోని వాగెట్టి బీచ్ లో తన పెంపుడు కుక్కతో కలిసి షికారుకు వెళ్లిన ఆమె విగతజీవురాలిగా కనిపించింది. రాజ్‌విందర్ ఈ హత్యచేసి ఉంటాడని పోలీసులు భావించారు. ఈ హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత రాజ్‌విందర్ సింగ్ తన భార్యాబిడ్డలను ఆస్ట్రేలియాలోనే వదిలిపెట్టి భారత్ కు పారిపోయి వచ్చాడు. దాంతో ఆస్ట్రేలియా పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. రాజ్‌విందర్ సింగ్ ఆచూకీ తెలిపిన వారికి ఆస్ట్రేలియా ప్రభుత్వం రూ.5.50 కోట్ల నజరానా ప్రకటించింది. రజ్వీందర్ సింగ్ భారత్ చేరుకున్నట్టు గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం అతడు పట్టుబడితే తమకు అప్పగించాలని 2021 మార్చిలో భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ విజ్ఞప్తికి భారత్ ఈ నవంబరు నెలలో ఆమోదం తెలిపింది. రాజ్‌విందర్ సింగ్ కోసం కేంద్రం ముమ్మర వేట సాగించింది. తాజాగా ఢిల్లీ పోలీసులు రాజ్‌విందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని త్వరలోనే ఆస్ట్రేలియాకు అప్పగించనున్నారు.

    “2018లో ఫార్ నార్త్ క్వీన్స్‌లాండ్‌లో టోయా కార్డింగ్‌లీ మరణంపై సుదీర్ఘ దర్యాప్తు జరిగిన తరువాత భారతదేశంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు మేము ధృవీకరించాము” అని క్వీన్స్‌లాండ్ పోలీసులు ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియన్ బలగాలు, ఇండియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రాజ్‌విందర్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

    Trending Stories

    Related Stories