Sports

నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ లో పతకం నెగ్గిన భారత హాకీ జట్టు

ఒలింపిక్స్ లో భారత పురుషుల జట్టు చరిత్ర సృష్టించింది. ఘన చరిత్ర ఉన్న భారత హాకీ జట్టు ఒలింపిక్స్ కు వెళ్లడం ఒట్టి చేతులతో వెనక్కు రావడం గత నాలుగు దశాబ్దాలుగా జరిగింది ఇదే..! ఎట్టకేలకు భారత్ టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించింది. కాంస్య పతకం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో 5-4తో విజయం సాధించింది. 41 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఒలింపిక్స్ లో హాకీకి పతకం దక్కింది.

మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఒకానొక దశలో జర్మనీ 3-1 తో ఆధిక్యంలో నిలవగా.. భారత్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. 5-3 తో భారత్ ఆధిక్యంలో ఉన్న సమయంలో.. జర్మనీ నాలుగో గోల్స్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఐదో గోల్ కోసం జర్మనీ ఎంతగానో ప్రయత్నించింది. ఆఖరి సెకండ్ లో కూడా పెనాల్టీ కార్నర్ జర్మనీకి లభించింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ దాన్ని అడ్డుకుని.. జర్మనీ స్కోరును సమం చేయకుండా ఆపగలిగాడు. భారత డిఫెన్స్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో జర్మనీకి మరో గోల్ దక్కకుండా జాగ్రత్తగా పడ్డారు. టోక్యోలో చారిత్రక విజయాన్ని అందుకున్న మన్‌ప్రీత్ సింగ్ సేనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన హాకీ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కాంస్య పతకాన్ని దేశానికీ తీసుకొస్తున్న పురుషుల జాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. భారతీయుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారంటూ వారిని కొనియాడారు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మరికొందరు ప్రముఖులు కూడా భారత జట్టు సాధించిన విజయంపై ప్రశంసలు కురిపించారు. భారత మహిళల జట్టు కూడా కాంస్య పతకం గెలుచుకునే అవకాశం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − eight =

Back to top button