భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్ లో బెల్జియం చేతిలో 5-2తో ఓటమి పాలైంది. ఒకానొక దశలో 2-1తో లీడ్ లో నిలిచిన భారత జట్టు మరో గోల్ చేయలేకపోయింది. బెల్జియం మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ 5-2తో విజయం సాధించింది. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్లు బెల్జియంకు కలిసి వచ్చాయి. మూడు, నాలుగు క్వార్టర్స్ లో బంతిని బెల్జియం తన అదుపులోనే పెట్టుకోవడంతో భారత్ కు ఎటువంటి అవకాశం రాలేదు. మూడు నాలుగు క్వార్టర్స్ లో బెల్జియం జట్టు అద్భుతంగా ఆడి.. కొన్ని దశాబ్దాల తర్వాత ఫైనల్ చేరాలనే భారత్ ఆశలపై నీళ్లు జల్లింది.
నాలుగో క్వార్టర్ ముగిసే సమయానికి 2-2 తో ఉన్న స్కోరును కాస్తా బెల్జియం ఫుల్ టైమ్ ముగిసే సమయానికి 5-2తో ముగించింది. నాలుగో క్వార్టర్ లో బెల్జియం ఏకంగా మూడు గోల్స్ చేసింది. వరుసగా బెల్జియంకు పెనాల్టీ కార్నర్స్ రావడం సమయం మించిపోవడంతో భారత్ కు ఓటమి కన్ఫర్మ్ అయింది. ఇక కాంస్యం కోసం భారత జట్టు తపడనుంది. భారత మహిళల జట్టు కూడా సెమీ ఫైనల్స్ లో ఉన్నారు. రేపు అర్జెంటీనాతో భారత మహిళల జట్టు తలపడనుంది.