అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) అపహరించినట్లు ఆ రాష్ట్ర ఎంపీ తపిర్ గావో బుధవారం ట్వీట్‌లో తెలిపారు. మిరామ్ టారోన్ అనే యువకుడిని మంగళవారం సియుంగ్లా ప్రాంతంలోని లుంగ్టా జోర్ ప్రాంతం నుండి పిఎల్‌ఎ అపహరించినట్లు తపిర్ గావో చెప్పారు. 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లిందని.. సియాంగ్ జిల్లా నుంచి అతన్ని అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్రంలోని లుంగ్తా జోర్ ప్రాంతం నుంచి మిరమ్‌ను అపహరించినట్లు ఎంపీ తాపిర్ గావో ట్వీట్‌లో వివరించారు. తారన్ స్నేహితుడు జానీ యయింగ్ పీఎల్ఏ దళాల నుంచి తప్పించుకున్నాడని, ఆ కుర్రాడు ఇచ్చిన సమాచారంతో తారన్ కిడ్నాప్‌కు గురైనట్లు తెలుస్తోందని ఎంపీ తాపిర్ తెలిపారు. తారన్, యాయింగ్‌లు స్థానికంగా వేటకు వెళ్లేవారు. భారత్‌లోకి సాంగ్‌పో నది ప్రవేశించే ప్రాంతంలో అపహరణ ఘటన చోటుచేసుకుందని అన్నారు.
అపహరణకు గురైన యువకుడి కోసం గురించి భారత సైన్యం చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని సంప్రదించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ప్రొటోకాల్ ప్రకారం అతడిని గుర్తించి తమకు అప్పగించాల్సిందిగా పీఎల్‌ఏను భారత్ కోరింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ఈ విషయమై స్పందించారు. భారత రక్షణ శాఖ దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. కిడ్నాపైన కుర్రాడు త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని అన్నారు.
ఈ విషయమై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ కిడ్నాప్ విషయం తమకు తెలియదన్నారు. తమ సైన్యం సరిహద్దులో అప్రమత్తమంగా ఉంటుందని తెలిపారు. అక్రమ చొరబాట్లను అణచివేస్తుందని అన్నారు. సెప్టెంబర్ 2020లో, చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సుబంసిరి జిల్లా నుండి ఐదుగురు యువకులను అపహరించి, ఒక వారం తర్వాత వారిని విడుదల చేసిన సంగతి తెలిసిందే..!