National

ఇంకెన్నాళ్లీ సమస్యలు.. ఇన్ఫోసిస్ పై కేంద్రం ఆగ్రహం

ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ కార్యకలాపాలు ఎంతో సులువుగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ పోర్టల్ తీసుకువచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే కాకుండా ఎన్నో ఉపయోగాల కోసం కొత్త వెబ్ సైట్ ను తీసుకుని వచ్చారు. కొత్త వెబ్ సైట్ యూజర్ ఫ్రెండ్లీ అని అధికారులు వెల్లడించారు. పాత వెబ్ సైట్ పోర్టల్ అయిన www.incometaxindiaefiling.gov.in ని.. కొత్తగా www.incometaxgov.in మార్చారు. ఇప్పటికే కొత్త పోర్టల్‌లో అనేక ఇబ్బందులు తలెత్తుతుండడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైట్‌ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్‌ అధికారులతో గతంలో భేటీ అయ్యారు. సమస్యలను తొలగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త వెబ్‌సైట్‌ వల్ల ఇబ్బందులు తలెత్తడంపై సీతారామన్‌ వారితో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏమాత్రం సమయం వృథా చేయకుండా వెంటనే వెబ్‌సైట్‌లోని సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు. పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వీలైనంత త్వరగా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

జూన్ 7 న ప్రారంభించిన కొత్త పోర్టల్ లో లాగిన్ కు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండడం, ఆధార్ ధ్రువీకరణ కోసం OTP రాకుండా ఉండడం, ఇంతకు ముందు సంవత్సరాలకు చెందిన ITR లు లభించకపోవడం వంటి అవాంతరాలను ఎదురవుతూ ఉన్నాయి. అనేక మంది పోర్టల్ ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కరించాల్సిన వాటిని తెలియజేశారు. యూజర్ ఇంటర్‌ఫేస్ వీక్ గా ఉందని కూడా పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. సాధారణ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి, 2021-22 అంచనా సంవత్సరానికి వారి వార్షిక రాబడిని దాఖలు చేయడానికి ఉపయోగించే పోర్టల్ అయినా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అటువంటి రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. ఇంకా ఎన్ని రోజులకు ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారమవుతాయోనని వినియోగదారులు టెన్షన్ పడుతూ ఉన్నారు.

ఈ పోర్టల్ ను సాంకేతికంగా అభివృద్ధి చేసే బాధ్యతను కేంద్రం ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ కు అప్పగించింది. అందుకు గాను ఇన్ఫోసిస్ కు ఇప్పటికే రూ.164.5 కోట్లు చెల్లించింది. ఇంతచేసినా కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ లో తరచుగా సాంకేతిక సమస్యలు వస్తుండడంతో కేంద్రం ఇన్ఫోసిస్ పై తీవ్ర అసంతృప్తి చేసింది. ఆగస్టు 21 నుంచి సైట్ నిలిచిపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త పోర్టల్ తీసుకువచ్చిన రెండున్నర నెలలకే సాంకేతిక సమస్యలు ఎందుకు వచ్చాయో వివరణ ఇవ్వాలంటూ ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ కు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా ఇలా సమస్యలు కొనసాగుతుండటంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం వచ్చి వివరణ ఇవ్వాలంటూ పోర్టల్‌ను రూపొందించిన టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈవో సలిల్‌ పరేఖ్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. నిర్వహణ పనుల కోసం ట్యాక్స్‌ పోర్టల్‌ అందుబాటులో ఉండదని ట్విటర్‌లో శనివారం ఇన్ఫోసిస్‌ ట్వీట్‌ చేసింది. అత్యవసర మెయింటెనెన్స్‌ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, పూర్తయ్యాక అప్‌డేట్‌ చేస్తామంటూ ఆదివారం మరో ట్వీట్‌ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 12 =

Back to top button