చెప్పు సైజుల్లోనూ విదేశీనేనా..!
త్వరలో మన “ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్”

0
730

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు దాటినా.. పాశ్చాత్య సంస్కృతి పట్టిపీడిస్తూనేవుంది. యువత భారతీయ మూలాలను వదిలేసి.. వెస్ట్రన్ కల్చర్ వెంబడి పరుగులు పెడుతోంది. బానిస సంకెళ్లు వీడినా, ఆ బానిసత్వపు వాసనలు ఇంకా కొనసాగుతూనేవున్నాయి. తలవెంట్రుల నుంచి కాలి గోటి దాకా.. వస్త్రదారణతో పాటు.. ఆచార, వ్యవహారాల్లోనూ పాశ్చాత్యులనే ఫాలో అవుతున్నారు. ప్రజలే కాదు.. ప్రభుత్వాల తీరు కూడా ఇందుకు అతీతం కాదు. ప్రతి విషయంలోనూ పాలకులు పాశ్చాత్య పోకడలనే ప్రజలపై రుద్దుతున్నారు. ప్రపంచ జనాభాలో ఏడోవంతు జనాభా కలిగిన భారతదేశంలో.. ఇప్పటికీ మనకంటూ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ లేదు. అదేనండీ.. మనం ధరించే పాదరక్షలకు సంబంధించిన కొలతల వ్యవస్థ.

మనల్ని రెండువందల ఏళ్లు పీడించుకుతిన్న తెల్లవాడి ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ నే మనం ఇప్పటికీ వాడుతున్నాం. 140 కోట్ల జనాభాతో.. భిన్న జాతులు, భిన్న సంస్కృతులతో కలిసి జీవిస్తున్న భారత్.. కేవలం రాజస్థాన్ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన యూకేనే ఇంకా ఫాలో అవుతోంది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తిపొందిన ఎన్నో దేశాలు ఇప్పటికే సొంత ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ ను వాడుతున్నాయి. కానీ, మనం మాత్రం ఇప్పటికీ యూకేనే అనుసరిస్తున్నాం. భారత్ లోకి ఎప్పుడైతే బహుళజాతి ఫుట్ వేర్ కంపెనీలు ఇంట్రీ ఇచ్చాయో.. వాటి సొంత దేశాలకు చెందిన ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ తో సహా దిగిపోయాయి. ఇప్పటికీ మనం తొడుక్కునే చెప్పులకు యూకే, యూఎస్ లేదా యూరోపియన్ సైజింగ్ సిస్టమే ఉంటుంది. బానిసత్వంలో మగ్గీ మగ్గీ మనకూ అదే అలవాటైంది. ఫుట్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో వుంది. అంత పెద్ద తయారీదారు ఇంకా యూరోపియన్ సైజింగ్ సిస్టమ్ ను అనుసరించడం బాధాకరం.

దాదాపు ఏడు దశాబ్దాలు దేశాన్ని పాలించిన గత పాలకులకు.. ఈ పాశ్చాత్య పద్దతిని మార్చాలన్న ధ్యాసే లేకుండాపోయింది. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ పద్దతికి చరమగీతం పాడబోతోంది అన్నిరంగాల్లోనూ భారతీయతకు ప్రాధాన్యత ఇస్తున్న మోదీ ప్రభుత్వం.. ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ ను కూడా మర్చబోతోంది. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన 74 ఏళ్ల తర్వాత మనకంటూ సొంత ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ సాకారం కాబోతోంది. ఇందులో భాగంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లో భాగమైన.. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనుంది. ఆగ్రా, అహ్మదాబాద్, కోయంబత్తూర్, చెన్నై, జోధ్ పూర్, జోర్హాట్, జలంధర్, కాన్పూర్, కోల్ కతా, ముంబై, పాట్నా, షిల్లాంగ్ తో సహా.. 94 జిల్లాల్లో సర్వే జరుగనుంది. ఈ సర్వే డేటా ఆధారంగా ఇండియన్ ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ ఏర్పాటు కానుంది. ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ విషయంలోనే కాదు.. రైట్ ఫిట్స్ అండ్ కంఫర్ట్స్ కు సంబంధించిన అన్ని అంశాల్లోనూ భారత్ కు సొంత గుర్తింపు ఉండాలి. ప్రతి విషయంలోనూ సొంత గుర్తింపు వైపు అడుగులు వేసేలా భారతీయులను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు.. సీఎస్ఐఆర్ చీఫ్ సైంటిస్ట్ మహమ్మద్ సాదిక్.

భౌతికంగా చూసుకున్నా.. భారతీయులకు ప్రత్యేకమైన ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ అవసరం. ఎందుకుంటే, పాశ్చాత్యులకంటే భారతీయుల పాదాల పరిమాణాల్లో చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా మన బొనటవేళ్లు విదేశీయులకంటే చాలా పెద్దగా వుంటాయి. దీంతో వారి సైజులను దృష్టిలో వుంచుకుని తయారు చేసిన చెప్పులనే మనం వాడాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కోసారి పెద్ద సైజులు కొనుక్కోవాల్సిన ఆగత్యం ఏర్పడుతుంది. అందువల్ల మనకంటూ ప్రత్యేకమైన ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్ కచ్చితంగా అవసరం. అంతేకాదు, భారత్ నిర్దేశించబోయే ఫుట్ వేర్ సైజింగ్ సిస్టమ్.. దక్షిణాసియా దేశాలకు సైతం ఆమోదయోగ్యం మారనుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

11 + 10 =