More

    చలికి తట్టుకోలేక భారత కుటుంబం మరణం

    చలికి తట్టుకోలేక ఓ చిన్నారి సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా-కెనడా సరిహద్దుల్లో చోటుచేసుకుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కెనడా-యుఎస్ సరిహద్దు సమీపంలో తీవ్రమైన చలికి ఒక శిశువుతో సహా నలుగురు సభ్యులతో కూడిన భారతీయ కుటుంబం మరణించింది. సరిహద్దుకు 9 నుంచి 12 మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. చనిపోయినవారు సరిహద్దులు వెంబడి 11 గంటల పాటు నడిచి ఉంటారని అధికారులు తెలిపారు.

    “కెనడా-అమెరికా సరిహద్దులో పసిపాపతో సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిస్థితిపై తక్షణమే స్పందించాల్సిందిగా అమెరికా, కెనడాలోని మా రాయబారులను కోరాం” అని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ట్వీట్ చేశారు. ఘటనపై విచారణ జరుగుతోంది. అమెరికా లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ట్వీట్ చేస్తూ ” ఇది దురదృష్టకర, విషాదకరమైన సంఘటన. దర్యాప్తుపై మేము అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము. @IndiainChicago నుండి కాన్సులర్ బృందం సమన్వయం చేయడానికి, అవసరమైన సహాయం అందించడానికి మిన్నెసోటాకు వెళుతున్నాం” అని అన్నారు.

    మృతుల్లో ఓ చిన్నారి సహా మైనర్ ఉన్నట్లు మనిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. ఎమెర్సన్కు సమీపంలో అమెరికా- కెనడా సరిహద్దులో కెనడావైపు గడ్డకట్టుకుపోయిన నాలుగు మృతదేహాలు బుధవారం లభించాయి. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీలుగా ఉంది. అమెరికా రాయబారి తరణ్జిత్ సంధు, కెనడాలోని ఇండియన్ హైకమిషనర్ అజయ్ బిసారియాతో జైశంకర్ మాట్లాడినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మరణాలకు మానవ అక్రమ రవాణా కారణమని అమెరికా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధం ఉన్న 47 ఏళ్ల స్టీవ్ శాండ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మిన్నెసోటా జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

    Trending Stories

    Related Stories