బ్రిటీష్ గడ్డపై త్రివర్ణాన్ని ఎగురవేసిన భారత జట్టు

బ్రిటీష్ గడ్డపై భారత క్రికెట్ జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారతదేశం 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న టీమిండియా జెండా పండుగను అక్కడే నిర్వహించింది. తాము బస చేసిన హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత జెండాను క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఎగురవేశారు. టీమ్ మేట్లతో కలిసి ‘జన గణ మణ అధినాయక జయహే’ అంటూ జాతీయ గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులు, వారి కుటుంబసభ్యులతోపాటు ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గత వారం ఇంగ్లండ్‌కు బయల్దేరిన బ్యాట్స్మెన్లు ప్రుథ్వీషా, సుర్యకుమార్ యాదవ్ కూడా కనిపించారు. వీరు తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిసి ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే 3 వ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉన్నారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆటలో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) వరుసగా రెండో టెస్టులోనూ సెంచరీ సాధించగా జానీ బెయిర్‌స్టో (107 బంతుల్లో 57; 7 ఫోర్లు) రాణించాడు. సిరాజ్‌కు 4, ఇషాంత్‌కు 3 వికెట్లు దక్కాయి. మూడో రోజు ఆట చివరి ఓవర్ చివరి బంతికి అండర్సన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది.