More

    భారత ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి

    జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు భారత సైన్యంపై చేసిన దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. రాజౌరీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్గల్ ఆర్మీ క్యాంపు వద్ద ఈ దాడి జరిగింది.

    జమ్మూ కశ్మీర్‌లోని పర్గల్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చడంతో బుధవారం రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి విఫలమైంది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని, ముగ్గురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారని భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు. సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు యత్నించారు. శిబిరంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించడాన్ని గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఈ దాడిలో మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయి. భారీ ఎత్తున గాలింపు చేపడుతున్నారు. భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అదనపు పార్టీలను అక్కడకు పంపించారు. బుద్గామ్‌లో ముగ్గురు ఎల్‌ఇటి ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరిగింది.

    Related Stories