జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు మనవే..!

0
733

జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఇండోనేషియా రాజధాని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సు రెండో రోజు సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టారు. ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి జీ20 అధ్యక్ష బాధ్యతలను నరేంద్ర మోదీ స్వీకరించారు. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష పదవిలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో భాగంగా బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు.

సదస్సుకు హాజరైన దేశాల అధినేతలు బుధవారం ఇండోనేషియాలోని అతి పెద్ద మడ అడవులను సందర్శించారు. ఇండోనేషియాలోని బాలిలో ఆ దేశ ప్రభుత్వం 13 వందల ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులను పెంచుతోంది. ఈ అడవులను సందర్శించేందుకు జీ20 దేశాల అధినేతలు వెళ్లారు. జీ20 దేశాల అధినేతలు అక్కడ ఒక్కో మొక్కను నాటారు.