More

    తిరువనంతపురం: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

    భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నేడు తిరువనంతపురంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. బుమ్రా, చహల్ ఈ మ్యాచ్ లో ఆడడంలేదు.

    భారతజట్టు:
    రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, హర్షల్ పటేల్, దీపక్ చహర్, అర్షదీప్ సింగ్.

    దక్షిణాఫ్రికా:
    టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), రిలీ రూసో, ఐడెన్ మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టాన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, ఆన్రిచ్ నోర్జే, తబ్రైజ్ షంసీ.

    టాస్ సమయంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ ‘మేము మొదట బౌలింగ్ చేయాలని భావిస్తున్నాం. గతంలో ఇక్కడ ఆడినప్పుడు ఇది మంచి వికెట్. మంచి బ్యాటింగ్ ట్రాక్ అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఈ ఫార్మాట్‌లో ఊపును కొనసాగించడం చాలా క్లిష్టమైనది. జట్టులో చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది.. మేము అన్ని విషయాలను సరిగా చూసుకోవాలి. ఇప్పటివరకు మేము బాగా చేస్తున్నాము.. మేము దానిని కొనసాగించాలనుకుంటున్నాము. ఈ సిరీస్ లో హార్దిక్, భువీలకు విశ్రాంతి లభించింది. వారి స్థానంలో పంత్, అర్ష్‌దీప్ వచ్చారు. బుమ్రాను ఈ మ్యాచ్ నుండి తప్పించాం. చాహల్ కూడా ఆడడం లేదు. దీపక్ చాహర్, అశ్విన్ మళ్లీ జట్టులోకి వచ్చారు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

    Trending Stories

    Related Stories