Sports

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్.. టికెట్లు-యాడ్స్ హాట్ కేకుల్లా

యూఏఈ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఇంకొన్ని వారాల్లో మొదలుకానుంది. భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 24న జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు టికెట్లు అప్పుడే అయిపోయాయి. యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ కు 70 శాతం ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. భారత్-పాక్ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న దుబాయ్ స్టేడియం సీటింగ్ సామర్థ్యం 25 వేలు కాగా, ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం 18,500 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.

చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగి చాలా సంవత్సరాలే అయ్యాయి. ఆసియా కప్, ఐసీసీ ఈవెంట్స్ లో భారత్-పాక్ మ్యాచ్ లంటే ఎక్కడలేని హై టెన్షన్ ఉంటుంది. ఓడిన జట్టుపై తీవ్ర విమర్శలు ఉంటాయన్నది తెలిసిందే..! మ్యాచ్ టికెట్లు ఆన్ లైన్ లో పెట్టిన కొన్ని నిమిషాల్లోనే మొత్తం అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను వెబ్‌సైట్‌ లో ఉంచిన కొన్ని నిమిషాలకే అమ్ముడైపోయాయి. బయట అమ్ముతున్న టికెట్లను కొనుక్కోడానికి చాలా ఎక్కువ క్యూ ఉంది. ప్రీమియం మరియు ప్లాటినం సెక్షన్ టిక్కెట్‌ల ధర 1,500- 2600 దిర్హమ్ లు ఉన్నాయి. అక్టోబర్ 17 న టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 24 న పాకిస్తాన్‌ తో భారత్ తలపడనుంది.

ఈ మ్యాచ్ క్రేజ్‌ను ఇక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ వదులుతుందా చెప్పండి. ఐసీసీ ఈవెంట్ హక్కులు కలిగిన స్టార్ స్పోర్ట్స్ ఈ టోర్నీకి స్పాన్సర్లను బుక్ చేసింది. వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్‌లో 10 సెకెన్ల యాడ్ రేటు రూ. 12 లక్షల నుంచి రూ. 18 లక్షల వరకు వసూలు చేస్తున్నది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో 10 సెకెన్ల యాడ్ ఇవ్వాలంటే రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా మ్యాచ్‌ల కంటే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌కు డబుల్ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ సమయంలో యాడ్ ఇవ్వడానికి పలు కంపెనీలు ముందుకు వచ్చాయి.

Related Articles

Back to top button