Sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిరాశపరిచిన రాహుల్, పుజారా..!

ఇంగ్లండ్ తో జరుగుతున్న అయిదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0 తో లీడ్ లో ఉంది. లీడ్స్‌ వేదికగా నేడు మూడో టెస్ట్‌ మొదలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగగా, ఇంగ్లండ్‌ జట్టు రెండు మార్పులు చేసింది. ఓపెనర్‌ సిబ్లే స్థానంలో డేవిడ్‌ మలాన్‌ జట్టులోకి రాగా, గాయపడిన మార్క్‌ వుడ్‌ స్థానంలో క్రెయిగ్‌ ఓవర్టన్‌ వచ్చాడు. అశ్విన్ ను తీసుకుంటారని భావించినప్పటికీ.. లార్డ్స్‌ టెస్ట్‌లో ఆడిన జట్టుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రెండో టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించడంతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌, ఇషాంత్ శర్మ.
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), జానీ బెయిరిస్టో, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), మొయిన్ అలీ, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, క్రెయిగ్ ఒవర్టన్, జేమ్స్ అండర్సన్.

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు జేమ్స్ ఆండర్సన్ షాకిచ్చాడు. కెఎల్ రాహుల్ డకౌట్ గా మొదటి ఓవర్ లోనే అవుట్ అవ్వగా.. పుజారా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. నాలుగు పరుగులకే భారత్ 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + seventeen =

Back to top button