హలో ఫ్రెండ్స్
భారత్ మారుతోంది. ఇప్పుడు ఇంట్లో నుంచి బయట బజారుకు వెళ్లాలంటే పర్సులో క్యాష్.., లేదంటే ATM కార్డు ఉండాల్సిన అవసరమే లేదు.! చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలూ..! అన్ని చెల్లింపులు చిటికేలో చేసేయ్యోచ్చు..!
రోడ్డు మీద ఛాయ్ బండి నుంచి మొదలు పెడితే బడా సూపర్ మార్కెట్ల వరకు.. , ఇంకా మిర్చి బజ్జీల బండి నుంచి.., బ్రాండెండ్ ఫూడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్ల వరకు…, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే… క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ప్రజలందరూ.. స్మార్ట్ ఫోన్ తో స్మార్టుగా చెల్లింపులు చేసేస్తున్నారు.! ఇదొక డిజిటల్ విప్లవం.
మన దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-UPI చెల్లింపులు జన సామన్యంలోకి ఎంత వరకు చొచ్చుకుపోయాయంటే.., చివరకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్ చేసుకుని భిక్షాటన చేసే వరకు.! అలా అని భిక్షాటనను నెగటివ్ అర్థంలో తీసుకొవద్దు.! మన సమాజంలో భిక్షాటనే వృత్తిగా జీవించే కొన్ని వర్గాలు ఉన్నాయి. వారికి ఇళ్ళు, భూమి, వ్యవసాయం ఉన్న తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను వదులుకోలేమనే వారు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గంగిరెద్దుల వాళ్లు తమ ఎద్దులను అలంకరించి పండగల సమయాల్లో ఇంటింటికీ తిరిగి నాదస్వరం ఊదుతూ భిక్షాటన చేస్తుంటారు.
ఇక విషయానికి వస్తే… మన దేశంలో ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఓ ఆసక్తిరమైన వీడియోను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
ఆ వీడియోలో ఓ గంగిరెద్దుల అతను… తన గంగిరెద్దు తలపైనా క్యూఆర్. కోడ్ ను ట్యాగ్ ను అమర్చి.., నాదస్వరం వాయిస్తూ.., ఇళ్లు ఇళ్లు తిరిగి భిక్షాటన చేస్తుండగా.., ఓ ఇంటి యజమాని వచ్చి…, ఆ గంగిరెద్దు తలకు ట్యాగ్ చేసిన క్యూఆర్. కోడ్ ను తన స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేసి.., డిజిటల్ చెల్లింపుల ద్వారా నగదున తన కుటుంబం తరపున భిక్షగా చెల్లించాడు.
ఇలా క్యాఆర్.కోడ్ ద్వారా కూడా భిక్ష ను తీసుకోవడం…, మన భారత్… గ్రాస్ రూట్ లేవల్లో.. డిజిటల్ చెల్లింపుల వైపునకు, ఎంత వేగంగా దూసుకునిపోయిందో మనకు తెలియజేస్తోంది.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా… భారత డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరింది’’ అని తన ట్విటర్ హ్యాండిల్ లో రాసుకొచ్చారు.
ఇక ఇప్పుడు మన దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక లావాదేవీలను మొదటి నుంచి పోత్సహిస్తూ వస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ –UPI చెల్లింపులు దేశమంతటా జరిగేలా ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరిలో కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ప్రాంతీయ పార్టీల నేతల వరకు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయా పార్టీల నేతలు పార్లమెంటు సాక్షిగా వ్యతిరేకించడం జరిగింది.
భారత దేశంలోని ప్రజలు బ్యాకింగ్ వ్యవస్థతో మమేకం కావడానికే ఏళ్ళు పట్టిందని.., అలాంటిది యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు చెస్తారని అనుకోవడం హస్యాస్పదంగా ఉందని.., గ్రామీణ ప్రజలు ఎక్కువగా నివసించే మన దేశంలో ఈ డిజిటల్ చెల్లింపులు అసాధ్యమని, మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విఫలం అవుతుందని.. సీనియర్ కాంగ్రెస్ నేత.., మాజీ ఆర్థిక మంత్రి అయిన పి.చిదంబరం పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని తూలనాడారు.
విపక్ష పార్టీలకు పీఎం మోదీపై విశ్వాసం లేకపోతేనేం… 130 కోట్ల మంది భారత ప్రజలు.. మాత్రం ప్రధాని మోదీ పై తమ సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. దేశానికి మంచి చేయాలనే సత్ సంకల్పంతో..ప్రారంభించిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల కార్యానికి మద్దతు పలికారు.
మొదట్లో యూపీఐ చెల్లింపులపై ప్రజలు కాసింత తడబడ్డా.., ఆ తర్వాత చాలా ఇజీగానే డిజిటల్ చెల్లింపులు చేయడం మొదలు పెట్టారు. యే నెలకు ఆ నెల ఈ డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సృష్టించారు. 2020లో యూపీఐ ఆధారిత పేటిఎం, గూగూల్ పే, ఫోన్ పే..ఇతర మనీ యాప్ ల ద్వారా 3 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరగడం విమర్శకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు 2021 జులై మాసం వరకు లెక్కలు వేస్తే..ఈ డిజిటల్ చెల్లింపులు..లావాదేవీల విలువ 6 లక్షల కోట్లకు పెరిగిందని తెలుస్తోంది.
మోదీ ప్రభుత్వం కూడా… ప్రజలు, వ్యాపారులు, కస్టమర్లు అందరూ డిజిటల్ చెల్లింపులు చేసేలా ఒత్తిడి చేస్తోంది. అంతేకాదు యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల ఛార్జీలను సైతం పూర్తిగా తీసివేసింది.
UPI ద్వారా లావాదేవీలు చేసే కస్టమర్‌లకు ఎటువంటి ఇతర ట్యాక్సులు ఉండవు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT గత ఏడాది ఆగస్టులోనే ఈ సర్క్యూలర్ ను జారీ చేసింది. UPI లావాదేవీలను ఉచితంగా అందించాలాని, వాటిపై ఎలాంటి రుసుములను వసూలు చేయకూడదని దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది మోదీ ప్రభుత్వం. ప్రస్తుతం అమెరికాలో కంటే కూడా మన దేశంలో డిజిటల్ చెల్లింపులు అధికంగా జరుగుతున్నాయని అధ్యయానాలు చెబుతున్నాయి.
దేశంలో UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ లావాదేవీలు పెరిగిపోవడంతో, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. అదే ATM సెంటర్లకు వెళ్లేవారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయిందని అంటున్నారు. నగదు జేబులో ఉంటే అతిగా ఖర్చు చేస్తామనే భయం కూడా ATM విత్ డ్రాలు తగ్గించేసేందనేవారు లేకపోలేదు.
డబ్బు కోసం ATM సెంటర్లకు ఏం వేళ్తాములే..! మనీ పేమేంట్ య్యాప్ లు ఉన్నాయి కదా..! వాటితో నగదు లేకుండా కొనుగోళ్లు జరుగుతున్నప్పుడు.., ఇక క్యాష్ తో పనేంటి అంటున్నారు మరికొంతమంది.! ఇంకా మనీ పేమెంట్ య్యాప్ ల ద్వారా, డిజిటల్ చెల్లింపులు చేస్తే. కస్టమర్లకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఆయా మనీ య్యాప్ కంపెనీలు.! క్యాష్ బ్యాక్ ఆఫర్లు , డిస్కౌంట్లు అన్ని క్షణాల్లో వారికి యాడ్ అవుతున్నాయి.
UPI లావాదేవీలతో.., దేశంలో ATM వ్యవస్థ.., క్రమంగా నామమాత్రంగా మారుతోందని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.! 2012 నుంచి 2017 వరకు ATM మార్కెటింగ్ వ్యవస్థ 14 శాతం వరకు వృద్ధిని సాధించింది. ఇప్పుడా వృద్ధి 4 శాతానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేస్తున్నారు.!
2017-2019 మధ్య కాలంలో మన దేశంలో ATMల సంఖ్య 2 లక్షల 22 వేలు. గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా చూస్తే.. నగదు ఉపసంహరణల వార్షిక వృద్ధి రేటు 9 నుంచి 10 శాతంగా నమోదు అయ్యిందని.., అదే డిజిటల్ చెల్లింపులతో సరిపోల్చి చూస్తూ ఇది చాలా తక్కువ అని కొంతమంది ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
గతంలో డెబిట్, అండ్ క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులు 83 శాతం వరకు ఉంటే… ఇప్పుడు చెల్లింపుల కోసం కార్డును వినియోగించేవారి సంఖ్య 50 శాతానికి పడిపోయింది. అలాగే ఏటీఎంల మెయింటెనెన్స్ కూడా ఖర్చుతో కూడుకుందని, ఇది ఆయా బ్యాంకులకు భారంగా మారుతుందనే వారు లేకపోలేదు.! RBI నిబంధనల మేరకు ప్రతి బ్యాంక్ ATMలను మెయిన్ టెయిన్ చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ATMలో నగదు లేకుండా పది గంటల మించితే…, ఆయా ఆపరేటర్లపై RBI జరిమానాలు కూడా విధిస్తోంది. అలాగని ATM వ్యవస్థను తక్కువగా చూడకూడదని మరికొంతమంది చెబుతున్నారు. ఇది కూడా నిజమే.!
అయితే ఇవన్నీ చూస్తేంటే మాత్రం… నగదు రహిత చెల్లింపులకు ATM కార్డులను వాడేకంటే కూడా…, UPI మనీ య్యాప్ లను వాడటమే బెస్టు.
ఎందుకంటే చిరిగిన నోట్లు అనే ఫికర్ ఉండదు. అలాగే మార్కెట్లో ఫేక్ నోట్లు వస్తాయనే భయం ఉండదు. ఇంకా చిల్లర సమస్య అసలే ఉండదు. ప్రభుత్వానికి బ్లాక్ మనీ బెడద కూడా తప్పుతుంది. వ్యాపార లావాదేవీల లెక్కలు అన్ని డిజిటల్ రూపంలో పక్కాగా రికార్డు అవుతాయి. ఈ చెల్లింపుల పరంగా.. వ్యాపారులు ప్రభుత్వానికి ట్యాక్స్ ఏగొట్టే ఛాన్స్ తక్కువ.!
నిజానికి ఈ డిజిటల్ విప్లవానికి అంకురార్పణ జరిగింది నోట్ల రద్దు నిర్ణయం తరువాతే. 2016 నవంబర్ నెలలో కేంద్రప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై లుటియెన్స్ మీడియా విషప్రచారం చేసింది కానీ.., దాని వల్ల జరిగిన ముఖ్యమైన ప్రయోజనం ఈ డిజిటల్ చెల్లింపుల విప్లవం. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లను చూపిస్తూ హడావిడి చేసిన జర్నలిస్టు మిత్రులు నేడు వెల వెలబోతున్న ఏటీఎంలు… పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడక పోవడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఇక ప్రాణంతో ఉండాలంటే మనిషికి మనిషి దూరం పాటించడమే మార్గమని ప్రపంచ దేశాలకు పెను సవాల్ విసిరిన కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి మన దేశ ప్రజలకు UPI చెల్లింపులు చాలా ఉపకరించాయి. నగదు చెల్లింపుల ద్వారా కరోనా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో దేశ ప్రజలు డిజిటల్ చెల్లింపులను త్వరగా అలవాటు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం చిన్న చిన్న పల్లెటూళ్ళలో సైతం UPI చెల్లింపులు విస్తరించాయి.
దీనికి మీరేమంటారు.! మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి.!
మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి. జాతీయవాద జర్నలిజాన్ని పోత్సహించండి.
భారత్ మాతాకీ జై.