More

    శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే.. మారిన భారత్ దౌత్యం..!

    శత్రు దేశం పాకిస్థాన్ కు తినడానికి తిండి లేకున్నా భారత్ పై మాత్రం బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. నిత్యం దెబ్బకొట్టెందుకు వ్యూహాలు రాచిస్తూనే ఉంటుంది. ఉగ్రవాదులను ఇండియా మీదకు ఊసుగొల్పుతూనే ఉంటుంది. ఐతే భారత్ కూడా ఎప్పటికప్పుడు ఆ కుట్రలను భగ్నం చేస్తూ వస్తోంది. ఐతే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వివాదం ముదిరింది. దానికి అమెరికా, చైనా లాంటి దేశాలు ఆజ్యం పోస్తూ వచ్చాయి. చీటికి మాటికి భారత్ పై అంతర్జాతీయ వేదికలపై విషయం చిమ్మే పాక్ ఇప్పుడు గోధుమ పిండి కోసం దేహీ అనే పరిస్థితి వచ్చింది. అయినా పాక్ ఆర్మీ మాత్రం ఇంకా భారత్ పై దాడి చేస్తూనే ఉంది.

    అందుకే భారత్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టుంది. పాకిస్తాన్ తో యుద్ధం వస్తే పది నిమిషాల్లో ఆ దేశ ఆర్మీని మట్టు పెట్టగలరు. అయితే దానికి అనేక అంతర్జాతీయ చట్టాలు అడ్డు వస్తున్నాయి. దీంతో శత్రవుకు శత్రువు మిత్రుడు అనే నినాదాన్ని భారత్ ఫాలో అవుతోంది. పాకిస్తాన్ తో బార్డర్ పంచుకుంటున్న దేశాలతో దోస్తీ చేస్తోంది. అటు ఇరాన్ తో దోస్తీ చేస్తూ చాబహార్ ఓడరేవును వాడుకుంటోంది. శత్రువును శత్రువుతోనే దెబ్బకోట్టాలనే వ్యూహన్ని అనుసరిస్తోంది.

    ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో సైతం భారీ పెట్టుబడులు పెట్టి వారిని మచ్చిక చేసుకుంది. పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేసేందుకు సైతం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇరాన్ కు పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి. దాంతో ఆ దేశ ఆర్మీ పాకిస్తాన్ సైనికులకు చుక్కులు చూపిస్తున్నారు. వారే అలా ఉంటే ఆఫ్ఘన్ సైనికులు మరీ క్రూరులు. తాజాగా ఆఫ్ఘన్, పాక్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని పాక్ భూబాగాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నారు.

    అలాగే పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు కారణం లేకుండానే మట్టు పెడుతున్నారు. ఇలాంటి టైంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. అస్రఫ్ ఘనీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే భారత్ చాలా సార్లు సాయం చేసింది. ఇక తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక దాదాపు ప్రపంచ దేశాలు అటు వైపు చూడటమే మానేశాయి.

    అలాంటి టైంలో వారు భారత్ సాయం అడిగారు. అప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న భారత్ అడిగిన వెంటనే ట్రక్కుల కొద్దీ, గోదుమ పిండీ, మెడిసిన్, ఆహార పదార్థాలను సాయంగా అందించింది. నిజానికి భారత్ పై తాలిబాన్లను ఉసిగొల్పాలని పాక్ భావించింది. కానీ భారత్ దౌత్యానికి పాకిస్తాన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. పాక్ వ్యూహన్ని భారత్ తిప్పి కొట్టడంతో శత్రు దేశం కంగుతింది.

    పాకిస్తాన్ మనకు ఎక్కుపెడదామనుకున్న తాలిబాన్ల బుల్లెట్ ఇప్పుడు ఆ దేశాన్నే టార్గెట్ చేసింది. భారత్ ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి 200ల కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. దానికి స్పందించిన తాలిబాన్ ప్రభుత్వం భారత్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇక భారత్ స్ట్రాటజీకి పాక్ తెగ కలవర పడుతోంది. ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విడనాడితే సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మన దేశ నేతలు చెబుతున్నారు. కానీ పాక్ మాత్రం తన బుద్ధిని మానుకోవటం లేదు.

    Trending Stories

    Related Stories