భారత్ భిక్షతో కోలుకుంటున్న పాక్..!
ఉచితంగా కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ

0
748

భారత్‎పై అనునిత్యం విషం కక్కే పాకిస్తాన్ పైన కూడా భారత దేశం తన ఔదార్యాన్ని చాటుకుంది. కొవిడ్ వ్యాక్సిన్లు అందించి పాకిస్తానీయులకు ప్రాణదానం చేస్తోంది. ఇప్పటికే భారత్ ప్రపంచ దేశాలకు పెద్దయెత్తున కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు కనీసం పేరు కూడా వినపడని చిన్న చిన్న మారుమూల దేశాలకు కూడా భారతీయు కొవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఈ దేశాలన్నీ భారత్ ఔదార్యానికి కృతజ్ఙతలకు చెబుతున్నాయి. తాజగా పాకిస్తాన్ కు సైతం భారత్.. వాక్సిన్లు సరఫరా చేస్తోంది. శత్రువైనా బాధలో వుంటే ఆదుకోవాలన్న కనీస ధర్మాన్ని పాటిస్తూ.. పక్క దేశానికి ఏకంగా దాదాపు 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తోంది.

కరోనా కష్టకాలంలో ప్రపంచానికి భారత్ ఆపద్బాంధవుడుగా కనిపిస్తోంది. అనేక దేశాలకు ఆపన్న హస్తం అందిస్తోంది. భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్ టీకాలు ప్రపంచ దేశాలకు నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. ఈ టీకాల కోసం అనేక అగ్రరాజ్యాలు భారత్ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. నిజానికి, పాకిస్తాన్ గనుక అడిగితే వ్యాక్సిన్లు అందిస్తామని భారత్ గతంలోనే ప్రకటించింది. కానీ, బీరాలకు పోయిన ఉగ్రవాద దేశం.. తన మిత్ర దేశమైన చైనాను నమ్ముకుంది. అయితే, చైనా ఉచితంగా కొన్ని టీకాలు ఎరవేసి.. బేరానికి దిగింది. చైనా వైరస్ ను తప్ప వ్యాక్సిన్లను సరఫరా చేయదన్న నిజాన్ని ఆలస్యంగా ఆలస్యంగా తెలుసుకున్న పాకిస్తాన్ కు దిమ్మతిగిరిపోయింది. అసలే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతన్న పాకిస్తాన్ చేతిలో టీకాలు కొనేందుకు చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. భారత్ వద్ద చేయిచాచాలని వున్నా.. ఎక్కడ చిన్నబోతామోనని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు మోకరిల్లింది. దీంతో ‘గావి’ఒప్పందంలో భాగంగా భారత్.. పాకిస్తాన్ కు 4.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందజేస్తోంది. ఇది పాకిస్తాన్ లో నాలుగోవంతు జనాభాకు సమానం. పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ లో తయారవుతున్న కొవీషీల్డ్ వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

కొవిడ్ టీకాలు లేక ఏ పేద దేశమూ వెనకబడకుండా అందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ తో కలిసి కొవ్యాక్స్ అనే గ్రూపును ఏర్పాటు చేసింది. ఆ గ్రూపు నుంచే మన కొవీషీల్డ్ వ్యాక్సిన్లు పాకిస్తాన్ కు అందనున్నాయి. ఒప్పందంలో భాగంగా.. మొదటి విడతలో కోటీ 60 లక్షల డోసులు మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ కు చేరుకుంటాయి. వీటిని భారత్ ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇక మిగతావి ఈ ఏడాది జూన్ నాటికి పాక్ కు అందుతాయని ‘గావి’ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదే విషయాన్ని పాక్ సెనేటర్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్ ఆ దేశ చట్టసభలో ప్రకటించారు. ‘గావి’ ఒప్పందంలో భాగంగా.. ఈ వ్యాక్సిన్లు పాకిస్థాన్‌కు వ‌స్తున్న‌ట్లు అక్క‌డి నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీసెస్ ఫెడ‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఆమిర్ అష్ర‌ఫ్ ఖ‌వాజా అక్క‌డి ప‌బ్లిక్ అకౌంట్స్ క‌మిటీకి వెల్ల‌డించారు.

ఇప్పటిదాక 65 కు పైగా దేశాలకు భారత్ కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసింది. మొత్తంగా 5.8 కోట్ల డోసులను ఆయా దేశాలకు పంపించింది. అందులో 1.63 కోట్ల డోసులను కొవ్యాక్స్ కింద పంపిణీ చేయగా.. 77 లక్షల డోసులను ఉచితంగా అందించింది. మిగతా 3.38 కోట్ల డోసులను వివిధ దేశాలకు అమ్మింది. శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మాయన్మార్, షీషెల్స్ సహా పలు దేశాలకు 56 లక్షల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందజేసింది.

భారత్ టీకా అందజేసిన దేశాల్లో బంగ్లాదేశ్, మాయన్మార్, నేపాల్, భూటన్, మాల్దీవులు, మారిషస్, షీషెల్స్, శ్రీలంక, బహ్రెయిన్, బ్రెజిల్, మొరాకో, ఒమన్, ఈజిప్టు, అల్జీరియా, దక్షిణాఫ్రికా, కువైట్, అఫ్గనిస్థాన్, బార్బడోస్, డొమినికా, మెక్సికో, డొమినికన్ రిపబ్లిక్, సౌదీ అరేబియా, ఎల్ సాల్వెడార్, అర్జెంటీనా, సెర్బియా, ఐరాస ఆరోగ్య కార్యకర్తలు. మంగోలియా, ఉక్రెయిన్, ఘనా, ఐవరీ కోస్ట్, సెయింట్ లూసియా, సెంట్ కిట్స్ అండ్ నెవీస్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడినైస్, సురినామ్, అంటిగ్వా అండ్ బార్బుడా, డీఆర్ కాంగో, అంగోలా, జాంబియా, నైజీరియా, కాంబోడియా, కెన్యా, లెసోథో, గునియా, జైమైకా, రువాండా, సా తోమే అండ్ ప్రిన్సిపే, సెనెగల్, గ్వాంటమాలా, కెనడా, మాలీ, సుడాన్, లైబీరియా, మాల్వీ, ఉండగా, యూకే, టోంగో, జిబౌట్, సోమాలియా, సియోర్రా లియోనే, బెలిజే, బోట్సవానా, మొజాంబిక్, ఇథియోపియా, తజికిస్థాన్ వున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేరింది. సంక్షోభ సమయంలో శతృత్వాన్ని వదిలేసి పాక్‌కి భారత్ ఇలా పరోక్షంగా సహాయపడటంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

seventeen + 1 =