More

    మరో సక్సెస్ ను సొంతం చేసుకున్న డీఆర్‌డీవో

    డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) మరో సక్సెస్ ను అందుకుంది. పూర్తీ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బ్రహ్మోస్ క్షిపణిని నింగి, నేల, ఉపరితలం నుంచి కూడా ప్రయోగించవచ్చు. అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన ఈ పరీక్ష విజయవంతమైనట్టు డీఆర్‌డీవో తెలిపింది. ఈ విస్తృత శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, ఇతర రక్షణ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతం అయినందుకు వీఆర్.చౌదరి రక్షణ శాఖను అభినందించారు. అండమాన్-నికోబార్ దీవుల్లోనే ఉన్న చౌదరి యుద్ధ సన్నాహాలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. పూర్తి కచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని ఛేదించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి గురించి ఇటీవల తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. కమాండ్ ఎయిర్‌స్టాప్ ఇన్‌స్పెక్షన్ (సీఏఎస్ఐ) సమయంలో భారత వాయుసేన యూనిట్ నుంచి సాంకేతిక లోపం కారణంగా మిస్‌ఫైర్ అయి పాక్ భూభాగంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదొక నిరాయుధ క్షిపణి కావడంతో దీని వల్ల స్వల్ప నష్టం మాత్రమే జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌కు లేఖ రాసింది. భారత ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.

    Trending Stories

    Related Stories