సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న కుట్రలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా భారత యువతను కూడా నాశనం చేయాలన్నది పాకిస్థాన్ కుట్రలో ఒక భాగం. ఇక్కడి యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాల్ని కూడా భారత్ అడ్డుకుంటూ ఉంది. పాకిస్థాన్ కు చెందిన 400 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోవడంతో.. ఆ దేశం చేస్తున్న డ్రగ్స్ వ్యాపారంపై యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడం ద్వారా భారత ప్రభుత్వం ముందడుగు వేసింది.
గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ఆరు మంది పాకిస్థానీ పౌరులను పట్టుకున్నారు. పాకిస్థానీ బోటులో మొత్తం 77 కిలోల హెరాయిన్ (భారత్‌లో నిషేధిత డ్రగ్)ను తీసుకువస్తున్నారు. ఈ డ్రగ్స్ విలువ 400 కోట్లకుపైగా ఉంటుంది. డ్రగ్స్ డెలివరీ కోసం సిబ్బంది హరి-1, హరి-2 వంటి కోడ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారు. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో జాఖౌ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో పడవను పట్టుకున్నారు.
గుజరాత్ ATS పత్రికా ప్రకటన ప్రకారం, డ్రగ్ కన్సైన్‌మెంట్ కరాచీలోని ఫిషింగ్ బోట్‌లో లోడ్ చేయబడింది.. దాని చివరి గమ్యం భారత జలాల్లో ఉంది. ఆ పడవ షహబాజ్ అలీ అనే పాకిస్థానీకి చెందినది. పడవలోని డ్రగ్స్‌ని కరాచీ పోర్ట్‌కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఫైబర్ బోట్ ద్వారా సిబ్బందికి సరఫరా చేశారు. పడవకు హెరాయిన్‌ను సరఫరా చేసిన ఇద్దరు పాకిస్థానీ స్మగ్లర్లను హాజీ హసన్, హాజీ హసమ్‌లు గుర్తించారు.
ప్లాన్ ప్రకారం పంజాబ్‌లోని అండర్‌వరల్డ్ తో సంబంధాలున్న వ్యక్తులకు డ్రగ్స్ సరఫరా చేయాలని భావించారు. పక్కా సమాచారం అందిన వెంటనే ఏటీఎస్, కోస్ట్‌గార్డ్‌లు తమ ఇంటర్‌సెప్టర్లతో పెట్రోలింగ్ ప్రారంభించారు. కొద్దిసేపటికే ‘అల్ హుస్సేనీ’ అనే బోటు వారి రాడార్‌లోకి వచ్చింది. పడవలోని సిబ్బందిని అన్ని వైపులా చుట్టుముట్టగా.. వారు పారిపోవడానికి ప్రయత్నించారు. పాకిస్థానీలు చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదు. వారి ప్రాణాలను కాపాడుకోవడానికి భారత అధికారులకు లొంగిపోవాల్సి వచ్చింది.
భారత్‌లో డ్రగ్స్ విక్రయించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు:
డ్రగ్స్ ద్వారా భారత యువతను నాశనం చేయాలని చేస్తున్న ప్రయత్నాల్లో పాకిస్థాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కోస్ట్‌గార్డ్, ఏటీఎస్‌ల సహకారంతో 150 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 30 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌లో, గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై ATS దాడి చేసి 600 కోట్లకు పైగా విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ATS ప్రకారం, ఆగస్టు 2018, డిసెంబర్ 2021 మధ్య 4,600 కోట్ల కంటే ఎక్కువ విలువైన 920 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఈ సీజ్‌లన్నింటిలో డ్రగ్ డీలర్లకు పాకిస్థాన్ మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది.
సెప్టెంబర్ 13న, గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న రెండు కంటైనర్లలో సుమారు 3,000 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ను జంబో బ్యాగ్‌లలో దాచి ఉంచారని, ప్రాసెస్ చేయని టాల్క్ పౌడర్ లా ఉందని చెప్పారు. డ్రగ్‌స్ ను బ్యాగ్‌ల కింది పొరల్లో ఉంచి, గుర్తించకుండా ఉండేందుకు టాల్క్ రాళ్లతో పైన ఉంచారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్‌లో జప్తు చేసిన డ్రగ్స్ విలువ సుమారు రూ. 20,000 కోట్లు ఉండొచ్చని చెబుతున్నారు.
డ్రగ్ కార్టెల్‌లో పాకిస్థానీ హస్తం ఉందని తేలిన వెంటనే, అదానీ పోర్ట్స్ పాకిస్థాన్, తాలిబాన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నుండి వచ్చే కార్గోను తీసుకోడానికి నిరాకరించింది.
పాకిస్థాన్‌కు డబ్బు సంపాదించాలంటే డ్రగ్స్ అమ్మడం ఒక్కటే మార్గం
ఆర్థికంగా దిగజారిపోయిన పాకిస్థాన్‌కు డబ్బు సంపాదించాలంటే డ్రగ్స్ అమ్మడం ఒక్కటే మార్గం. ఆఫ్ఘన్ భూభాగంపై తాలిబాన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నప్పటి నుండి.. దక్షిణాసియాలో డ్రగ్స్ ముప్పు పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా అక్రమ హెరాయిన్, హషీష్ ను సరఫరా చేస్తోంది. భారతదేశ క్రియాశీల దౌత్యం తాలిబాన్లకు (పాకిస్థాన్ చైనా మినహా) అంతర్జాతీయ నిధులపై దాదాపు అన్ని దారులను మూసివేసింది. పాకిస్థాన్‌తో సరిహద్దు వాణిజ్యాన్ని తెరవాలని భారతదేశంలోని కొంతమంది రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఇలా చేసి పాకిస్థాన్‌కు స్వేచ్ఛనివ్వడం పెద్ద తప్పిదమయ్యే అవకాశం ఉంది.