More

    అమెరికా నుండి MH-60 రోమియో హెలికాప్టర్లను అందుకున్న భారత్

    యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి భారత్ రెండు MH-60 రోమియో హెలికాప్టర్లను అందుకుంది. అమెరికాతో కుదుర్చుకున్న డీల్ లో భాగంగా భారత్ కు మొదటి బ్యాచ్ లో భాగంగా ఈ రెండు MH-60 రోమియో హెలికాప్టర్లు వచ్చి చేరాయి. సికోర్స్కీ MH-60ఆర్ మ‌ల్టీ రోల్ హెలికాప్ట‌ర్ల‌ను అమెరికా నౌకాద‌ళం భార‌త్‌కు అప్ప‌గించింది. తొలి ద‌శ‌లో భాగంగా రెండు హెలికాప్ట‌ర్ల‌ను ఇండియ‌న్ నేవీ అందుకుంది. ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తున్నట్టు గత ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ప్రకటించింది.

    సాన్‌డియాగోలో ఉన్న నార్త్ ఐల్యాండ్‌లోని నావెల్ ఎయిర్ స్టేష‌న్‌లో ఈ అప్ప‌గింత కార్య‌క్ర‌మం జ‌రిగింది. భార‌తీయ నౌకాద‌ళం 24 సికోర్స్కీ హెలికాప్ట‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చింది. విదేశీ సైనిక ఒప్పందంలో భాగంగా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. సుమారు 2.4 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి ఎంహెచ్‌-60ఆర్ హెలికాప్టర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. హెలికాప్ట‌ర్ల అప్ప‌గింత కార్య‌క్ర‌మంలో భార‌తీయ అంబాసిడ‌ర్ త‌ర‌న్‌జిత్ సింగ్ సంధూ పాల్గొన్నారు. వైస్ అడ్మిర‌ల్ కెన్నెత్ వైట్‌సెల్‌, వైస్ అడ్మిర‌ల్ రవ్‌నీత్ సింగ్ ఒప్పంద డాక్యుమెంట్ల‌ను మార్చుకున్నారు. సామర్థ్యం, పనితీరు విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్లుగా వీటికి ప్రసిద్ధి. వీటితో భూమ్మీద ఉన్న శత్రు లక్ష్యాలను ఛేదించడంతో పాటు జలాంతర్గాములపైనా దాడులు చేసేందుకు వీలుంటుంది. కేవలం మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే కాకుండా సహాయ చర్యలు, కమ్యూనికేషన్స్ వంటి వాటికీ ఈ హెలికాప్టర్లను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

    శాన్ డియాగో యొక్క నార్త్ ఐలాండ్‌లోని నావల్ ఎయిర్ స్టేషన్‌లో యుఎస్ నేవీ మొదటి రెండు సికోర్స్కీ ఎంహెచ్ -60 ఆర్ మల్టీ-రోల్ హెలికాప్టర్లను భారత నావికాదళానికి అప్పగించింది. రెండు ఎంహెచ్ -60 రోమియో హెలికాప్టర్లను అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారత నేవీ డిప్యూటీ చీఫ్ వైస్ అడ్మిరల్ రవ్నీత్ సింగ్ శాన్ డియాగోలోని యుఎస్ నేవీ బేస్ వద్ద అందుకున్నట్లు ఏఎన్ఐ మీడియా సంస్థ తెలిపింది. అన్ని వాతావరణాల్లోనూ సమర్థంగా పనిచేసే ఈ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ బంధం మరింత దృఢమవుతుందని తరణ్ జీత్ సింగ్ సంధు అన్నారు. గత రెండేళ్లలో 2000 కోట్ల డాలర్ల ఒప్పందాలు జరిగాయని .. కేవలం కొనుగోళ్లకే పరిమితం కాకుండా రక్షణ రంగ వ్యవస్థల అభివృద్ధి, వాటి ఉత్పత్తిలో కలిసి పనిచేసేందుకు రెండు దేశాలు కసరత్తులు చేస్తున్నాయన్నారు. రక్షణ రంగంలో భారత్ తీసుకొచ్చిన సంస్కరణలతో విదేశీ పెట్టుబడిదారులకు మరిన్ని కొత్త అవకాశాలు అందుతాయన్నారు. యుఎస్ ఫారిన్ మిలిటరీ సేల్స్ (ఎఫ్‌ఎంఎస్) కార్యక్రమం కింద ఈ ఒప్పందం ప్రభుత్వం నుండి ప్రభుత్వానికి (జి 2 జి) ఒప్పందంలో భాగంగా కుదుర్చుకుంది.

    MH-60 రోమియో హెలీకాప్టర్ల లో మల్టీ-మోడ్ రాడార్లు, నైట్-విజన్ పరికరాలతో పాటు హెల్ఫైర్ క్షిపణులు, టార్పెడోలు మరియు ఖచ్చితమైన-గైడెడ్ ఆయుధాలు ఉన్నాయి.హెలికాప్టర్లు యుద్ధనౌకలు, డిస్ట్రాయర్లు, క్రూయిజర్లు, విమాన వాహక నౌకల నుండి పనిచేసేలా రూపొందించబడ్డాయి. ఇవి జలాంతర్గాములను వేటాడడంతో పాటు ఓడలను పడగొట్టడం మరియు సముద్ర భాగంలో సెర్చ్-రెస్క్యూ ఆపరేషన్లు చేయగలవు. హెలికాప్టర్లు భారత్ అవసరాల కోసం ప్రత్యేక సామగ్రిని ఉంచుకోవడం కోసం మోడిఫికేషన్ చేశారు. ఈ శక్తివంతమైన హెలికాప్టర్లను వినియోగించడం కోసం భారత సిబ్బంది మొదటి బ్యాచ్ ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతోంది.

    MH-60R Multi Role Helicopters.

    Trending Stories

    Related Stories