More

    పాక్ నైజంలో ఊహించని మార్పు..! ఏంటి ఇదంతా నిజమే..?

    ఇట్ కా జవాబ్ పత్తార్ సే దేనా అంటే ఇదే..! లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అకారణంగా కాల్పులు జరిపే పాకిస్తాన్…ఇప్పుడు దిగివచ్చింది. భారత్ తో ఇకపై నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపమని…అందుకు అంగీకారం తెలిపింది.! దీనికి భారత్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.!  

    భారత్ తో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్తాన్ లో సడన్ గా ఇంత మార్పునకు కారణం ఏంటీ? ఎందుకు పాకిస్తాన్ దిగివచ్చింది.! తూర్పు లద్దాఖ్ లో…,  చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చుక్కలు చూపిన భారత సైన్యం తెగువను చూసి పాకిస్తాన్ భయపడిందా? దేశ రక్షణ విషయంలో… ముఖ్యంగా సైన్యానికి మోదీ సర్కార్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం…, చైనాతో దృడంగా వ్యవహారించడంతో పాక్ పాలకుల్లో కలవరం మొదలైందా?  ఇప్పటికే భారత్ జరిపిన..సర్జికల్ స్ట్రయిక్స్, ఆ తర్వాత వైమానిక దాడుల దెబ్బ రుచిచూసిన పాకిస్తాన్ కాంప్రమైజ్ కు వచ్చిందా? తాను పెద్దదిక్కుభావించే చైనానే… భారత్ తో తూర్పు లద్దాఖ్ లో.., ఎదురూ నిల్వలేక తోకముడిచిన తర్వాత…, పాకిస్తాన్ లోనూ మార్పు వచ్చిందని కొంతమంది రక్షణ రంగ విశ్లేషకులు అంటున్నారు. అలాగే పీకల్లోతూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ కు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ అప్పుపుట్టకుండా చేసే గ్రే లిస్ట్ భయం కూడా పట్టుకుంది. ఈ పరిస్థితుల్లో భారత్ తో సయోధ్యకు తామే ముందడుగు వేస్తున్నట్లు ప్రపంచ దేశాల నమ్మించి ఇప్రెషన్ కొట్టోసి… గ్రే లిస్ట్ బారి నుంచి పడకుండా ఆయా దేశాల మద్దతు సంపాదించడం కోసం.. పాక్ ఈ ప్రతిపాదన చేసి ఉంటుందని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

    పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూచనల మేరకు.., ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్ యూసఫ్… భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ తో పలు దఫాలు చర్చలు జరిపారనే ప్రచారం జరుగుతోంది. పాక్ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన గురించి ప్రధాని నరేంద్రమోదీతోపాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అలాగే విదేశాంగమంత్రి జైశంకర్ కు మాత్రమే తెలుసునని అంటున్నారు.

    ఈ క్రమంలోనే ఇరు దేశాల సైనిక బలగాలు… ఇక నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుకోరాదనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్..కు ఇలా ఒప్పందాలు చేసుకుని..అలా తూట్లు పొడవడం అలవాటేననే విషయం మనం మర్చిపోరాదు.  2003లో కూడా ఇలాంటి ఒప్పందమే చేసుకుని… ఆ తర్వాత తూట్లు పొడిచింది. కుక్కతోక వంకర మాదిరిగా పాకిస్తాన్ వక్రబుద్ధి మారదనే విషయం మన పాలకులకు తెలియంది కాదు. గడిచిన మూడేళ్లల్లో పదివేల సార్లకు పైగా పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 72 మంది జవాన్లతపాటు 70 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం మర్చిపోరాదు.

    Trending Stories

    Related Stories