More

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే రద్దు

    భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే భారీ వర్షం కారణంగా రద్దైంది. హామిల్టన్ లో ఆదివారం మొదలైన మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడుతూనే వచ్చాడు. ఆట మొదలైనప్పటి నుంచి వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. 29 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు వచ్చింది. టీమిండియా 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న దశలో వర్షం పడటంతో ఆట ఆగింది. శుభ్‎మన్ గిల్ 42 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‎తో 45 రన్స్ చేయగా.. సూర్యకుమార్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత మైదానంలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. తొలి వన్డేలో నెగ్గిన న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్ లో 1-0లో ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడో ఈ నెల 30న జరగనుంది. భారత్ సిరీస్ ను సమం చేయాలంటే చివరి వన్డేలో కచ్చితంగా గెలవాలి.

    Trending Stories

    Related Stories