National

డ్రోన్ల వల్ల ఎదురవుతున్న ముప్పుపై దళాలను అప్రమత్తం చేశాం: నరవాణే

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవలి కాలంలో డ్రోన్ అటాక్స్ చోటు చేసుకోవడంతో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. జూన్ 27న జమ్ము ఎయిర్ బేస్ టెక్నికల్ ఏరియాలో డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో భారత వాయుసేన స్థావరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) ఇక్కడ మోహరించినట్టు వాయుసేన వర్గాలు తెలిపాయి. దీంతోపాటే రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్టర్, సాఫ్ట్ జామర్ లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించాయి. మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజ్వానీ ప్రాంతాల్లో డ్రోన్స్ గుర్తించారు.

డ్రోన్లు ఈజీగా లభించడం రక్షణ సంస్థలకు సవాల్‌ అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిందని.. సైనిక కేంద్రాల సంరక్షణ పరిస్థితిని ఇది మరింత జఠిలం చేసిందని అన్నారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థల రక్షణాత్మక వినియోగంపై సైన్యం దృష్టి పెట్టిందని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లోకి ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు ఉగ్రవాదుల నిర్మూలనపై ఆర్మీకి గట్టి పట్టు ఉందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత కోసం దీనిని కొనసాగిస్తామని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని ఆర్మీ చీఫ్‌ అన్నారు. జమ్మూలోని ఎయిర్‌బేస్‌లో ఆదివారం జరిగిన రెండు పేలుళ్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ నరవాణే ఈ వ్యాఖ్యలు చేశారు. పేలుడు పదార్థాలను వదలడానికి డ్రోన్లను ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారని.. కానీ భారత వైమానిక దళం దీనిని ధృవీకరించలేదు. ఈ దాడిలో ఇద్దరు భారత వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు.

డ్రోన్ల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి దళాలను అప్రమత్తం చేశారని ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ ముప్పును పరిష్కరించే సామర్థ్యాన్ని మేము అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు. “మేము డ్రోన్ల ప్రమాదకర వాడకంపై దృష్టి పెడుతున్నాము మరియు ముప్పును పరిష్కరించడానికి కౌంటర్-డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాము” అని అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి మరియు ప్రశాంతతను నిర్ధారించడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయని అన్నారాయన.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 − four =

Back to top button