Sports

అట్టహాసంగా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరెమనీ

జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవాలు నేడు సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. ఒలింపిక్స్‌ క్రీడలను జపాన్ చక్రవర్తి నరహిటో ప్రారంభించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఆరంభోత్సవం జరిగింది.

ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మ‌నీలో భాగంగా అన్ని దేశాల అథ్లెట్లు ప‌రేడ్ నిర్వ‌హించారు. ఈ ప‌రేడ్‌లో ప్రాచీన‌, ఆధునిక ఒలింపిక్స్ జ‌న్మ‌స్థ‌ల‌మైన గ్రీస్ ముందు ఉంటుంది. గ్రీస్ బృందం త‌ర‌ఫున షూటింగ్‌, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో పాల్గొంటున్న అనా కొర‌కాకి, ఎలిఫ్‌తోరియోస్ పెట్రోనియాస్ గ్రీస్ జాతీయ ప‌తాకాన్ని ప‌ట్టుకొని ముందు న‌డిచారు. జ‌పాన్ భాష ప్ర‌కారం ఆల్ఫాబెటిక‌ల్ ఆర్డ‌ర్‌లో టీమ్స్ ప‌రేడ్‌లో పాల్గొన్నాయి.

భారతజట్టు త‌ర‌ఫున మొత్తం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు ఈ ప‌రేడ్‌లో పాల్గొన్నారు. ఆరుసార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయిన బాక్సర్ మేరీ కోమ్‌, హాకీ టీమ్ కెప్టెన్ మ‌న్‌ప్రీత్ సింగ్ త్రివ‌ర్ణ ప‌తాకంతో ముందు న‌డిచారు. ఈసారి 127 మంది అథ్లెట్ల బృందంతో భారత్ వెళ్ళింది కానీ.. ఓపెనింగ్ సెర్మ‌నీలో మాత్రం వారి సంఖ్య 19కే ప‌రిమిత‌మైంది. ఈ ఏడాది భారత్ నుంచి 120 మంది వివిధ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో భారత బృందం ఒలింపిక్స్‌కు వెళ్లలేదు. ఆర్చరీ, ఆర్టిస్టిక్, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, బ్యాండ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ వంటి 18 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

7 + 16 =

Back to top button