More

    ఖలిస్థాన్ పై రెఫరెండం.. కెనడాకు భారత్ చెబుతోంది ఇదే..!

    కెనడాలోని ఆంటారియాలో నవంబర్ 6న ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ ఖలిస్థాన్ పై రెఫరెండం నిర్వహించాలని భావిస్తోంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ఖలిస్థాన్ పై రెఫరెండం నిర్వహించకుండా అడ్డుకోవాలని, జస్టిన్ ట్రూడో ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత దేశ సమగ్రత, సౌర్వభౌమత్వాన్ని ఈ రెఫరెండం సవాలు చేస్తోందని.. కెనడా హై కమిషన్ సీనియర్ అధికారికి డీమార్చ్ (అధికారిక వినతి/డిమాండ్)ను భారత విదేశాంగ శాఖ అందజేసింది. భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని తాము గౌరవిస్తామని కెనడా ప్రభుత్వం సెప్టెంబర్ 16న ప్రకటించింది. ఖలిస్థాన్ రెఫరెండాన్ని తాము గౌరవించబోమని తేల్చి చెప్పింది. తొలిసారి రెఫరెండాన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ గత నెల 18న ఆంటారియాలోని బ్రాంప్టన్ లో నిర్వహించగా, రెండో విడత నవంబర్ 6న ఆంటారియా సబర్బన్ లోని ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనుంది. రెఫరెండాన్ని తాము గుర్తించబోమని, భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని కెనడా అంటోంది.

    Trending Stories

    Related Stories