భారతదేశంలో రెండు లక్షల లోపు కరోనా కేసులు నమోదయ్యాయి. గత 44 రోజులతో పోలిస్తే గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసులే తక్కువగా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,86,364 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 2,59,459 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,75,55,457కు చేరింది. మరో 3,660 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,18,895కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,48,93,410 మంది కోలుకున్నారు. 23,43,152 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 20,57,20,660 మందికి వ్యాక్సిన్లు వేశారు.
27-05-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గడచిన 24 గంటల్లో 90,226 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,614 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 504 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నల్గొండ జిల్లాలో 229, ఖమ్మం జిల్లాలో 228, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 204 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,961 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,207కి పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 5,67,517 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,26,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,267 మందికి చికిత్స జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 84,224 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 16,167 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,967 కొత్త కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,325 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 104 మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో 14 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విశాఖ జిల్లాలో 11 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. కరోనా మృతుల సంఖ్య 10,531కి పెరిగింది. అదే సమయంలో 21,385 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 16,43,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా 14,46,244 మంది కోలుకున్నారు. ఇంకా 1,86,782 మందికి చికిత్స జరుగుతోంది.