National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 92,596 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 1,62,664 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,89,069కు చేరింది. మరో 2,219 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,53,528కు పెరిగింది. భారతదేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,75,04,126 మంది కోలుకున్నారు. 12,31,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,90,58,360 మందికి వ్యాక్సిన్లు వేశారు.

08-06-2021న తెలంగాణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 1,33,134 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,897 పాజిటివ్ కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 182, ఖమ్మం జిల్లాలో 163, నల్గొండ జిల్లాలో 151, రంగారెడ్డి జిల్లాలో 114, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 2,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,67,285కి పెరిగింది. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 95.34 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,95,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 24,306 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఒక్కరోజులో 15 మంది మరణించగా, ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,409కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 89,732 కరోనా పరీక్షలు నిర్వహించగా 7,796 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 1,302 కేసులు, చిత్తూరు జిల్లాలో 1,210 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 147 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 14,641 మంది కోలుకున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో 77 మంది చనిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 11,629కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 17,71,007 పాజిటివ్ కేసులు నమోదు కాగా 16,51,790 మంది కోలుకున్నారు. ఇంకా 1,07,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 4 =

Back to top button