లీగ్ స్టేజ్ లోనూ పాకిస్థాన్ చిత్తు.. కాంస్యం పోరులో కూడా భారత్ దే విజయం

0
926

పురుషుల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2021లో భార‌త్ కాంస్య ప‌త‌కం గెలుచుకుంది. మూడో స్థానం కోసం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ లో చివ‌ర‌కు భార‌త జట్టునే విజ‌యం వ‌రించింది. ఈ మ్యాచ్ ను భారత్ చాలా దూకుడుగా మొదలుపెట్టింది. మొదటి క్వార్టర్ ఆరంభంలోనే ఫెనాల్టీ కార్న‌ర్ అవ‌కాశాలు వ‌చ్చాయి. 11వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ సాధించి భార‌త్‌ను 1-0తో అధిక్యంలోకి తీసుకెళ్లాడు. మ్యాచ్ 33వ నిమిషంలో పాకిస్థాన్ ప్లేయ‌ర్ అబ్దుల్ రానా గోల్ సాధించి స్కోర్‌ను 1-1తో స‌మం చేశాడు. ఆ తర్వాత పాక్ మరో గోల్ సాధించి 2-1తో అధిక్యంలోకి దూసుకెళ్లింది. భార‌త్ తరపున 53వ నిమిషంలో వరుణ్ కుమార్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు ఆధిక్యాన్ని అందించాడు. టీమిండియా 3-2తో అధిక్యంలో నిలిచింది. మ్యాచ్‌ 57వ నిమిషంలో ఆకాశ్‌దీప్ గోల్ సాధించ‌డంతో భార‌త్ ఆధిక్యం 4-2 అయింది. పాకిస్థాన్ మ‌రో గోల్ చేసిన‌ప్ప‌టికీ అప్పటికే ఆలస్యం అయింది. భారతజట్టు 4-3తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి భార‌త జ‌ట్టు కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌ఫున హర్మన్‌ప్రీత్ సింగ్, సుమిత్, వరుణ్ కుమార్, ఆకాశ్‌దీప్ సింగ్ గోల్స్ చేయగా.. పాకిస్థాన్ తరఫున అర్ఫ్రాజ్, అబ్దుల్ రాణా, నదీమ్ గోల్స్ చేశారు. భారత కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు ఇచ్చారు. సెమీస్‌లో టీమిండియా 3-5 తేడాతో జపాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్.. ద‌క్షికొరియా చేతిలో 5-6 తేడాతో ఓడిపోయింది. లీగ్ స్టేజ్‌లోనూ పాకిస్థాన్‌ ను భార‌త్ 3-1 తేడాతో ఓడించింది. సెమీఫైనల్‌లో జపాన్ చేతిలో ఓటమిపాలైన భారత్‌. మూడో స్థానం కోసం పాక్‌తో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 4-3 గోల్స్ తేడాతో పాక్‌పై విజయం సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.