సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వివేకానంద పురీ కాలనీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద సంక్షేమ సంఘం అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు మరు మాముల రామచంద్ర మూర్తి ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనలిస్ట్ హబ్ ఛానెల్ కో ఫౌండర్ అమోగ్ దేశపతి హాజరయ్యారు.