More

    జమ్మూ కశ్మీర్ త్రివర్ణ శోభితమై..!

    గత కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్‌ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు దూరంగా ఉంది. అయితే భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ భారత జెండా రంగులతో వెలిగిపోయింది. కశ్మీర్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా సైట్లలో వైరల్ అవుతూ ఉన్నాయి. కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాలు జాతీయ జెండా రంగులతో వెలిగిపోతున్నాయి. 2019 లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత లోయలో ఇది మూడో స్వాతంత్ర్య దినోత్సవ వేడుక. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద ఉన్న క్లాక్ టవర్ కూడా జాతీయ జెండా రంగులతో వెలిగిపోయింది. రియాసి జిల్లాలోని సాలాల్ డ్యామ్‌లో భారత జెండా రంగులతో లైట్లు ఏర్పాటు చేయబడ్డాయి.

    75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్ అంతటా JKPDCL యొక్క ప్రాజెక్టులు కూడా త్రివర్ణ రంగులో వెలిగిపోయాయి.

    కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న పాత జీరో బ్రిడ్జ్‌ని త్రివర్ణ కాంతితో వెలిగించిన వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్స్ లో చక్కర్లు కొడుతోంది.

    కశ్మీర్ లోని శ్రీనగర్ లో అనేక ఫ్లైఓవర్లు, వంతెనలు మరియు భవనాలు కూడా భారత జెండా రంగులతో అలంకరించబడ్డాయి.

    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని బాగ్లియార్ డ్యామ్ కూడా భారత జెండా రంగులతో ప్రకాశిస్తోంది.

    భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తైన త్రివర్ణాన్ని శ్రీనగర్‌లోని హరి పర్బత్ కోటలో ఆవిష్కరించనున్నట్లు శ్రీనగర్ మేయర్, జునైద్ అజీమ్ మట్టు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

    స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, జమ్మూ కశ్మీర్ అంతటా వందలాది పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు నేడు జాతీయ జెండాను ఎగురవేశాయి. ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 23,000 పాఠశాలల్లో భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2003 తర్వాత ఆగస్టు 15 న భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున కశ్మీర్‌లో మొదటిసారిగా అన్ని ఫోన్, SMS మరియు ఇంటర్నెట్ సేవలు పూర్తి వేగంతో పనిచేస్తున్నాయని జర్నలిస్ట్ అహ్మద్ అలీ ఫయాజ్ తన ట్వీట్‌లో చెప్పారు.

    పలువురు కశ్మీర్ వాసులు తమ భూభాగంలో త్రివర్ణ పతాకం ఎగరడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు చెబుతూ కశ్మీర్ వాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమ ప్రాంతంలో ఇది సరికొత్త చరిత్ర అంటూ చెప్పుకొచ్చారు. “I am celebrating Independence Day, in my homeland Kashmir for the first time in my life! Can’t believe it’s happening. This is HISTORY. Had yearned for it all my life as a displaced Hindu who grew up in a refugee camp in Jammu. Thank you, @[email protected]@OfficeOfLGJand“ అంటూ పోస్టులు పెట్టారు. ఇలాంటి ఓ ఘట్టం తమ ప్రాంతంలో జరుగుతుందని అనుకోలేదని అన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories