More

    నేడు దక్షిణాఫ్రికాతో తలపడనున్న భారత్.. లైవ్ డీటైల్స్ ఇవిగో..!

    పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. పెర్త్ లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ మ్యాచ్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, పెర్త్ లో సాయంత్రం మేఘావృతమై ఉంటుంది.. అయితే ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చని అంటున్నారు. వరుసగా రెండు విజయాల తర్వాత, ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచ కప్ 2022లో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం భారత్ కు సులువుగానే కనిపిస్తోంది. పెర్త్‌లో ఆదివారం దక్షిణాఫ్రికాతో మూడో మ్యాచ్‌ లో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో టీ20ల్లో 13-9తో భారత్ ముందుంది. T20 ప్రపంచ కప్ గేమ్‌లలో, భారతదేశం ఇప్పటివరకు 4 గేమ్‌లను గెలుచుకుంది, దక్షిణాఫ్రికా కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచింది.

    ఎప్పుడు: భారత్ vs దక్షిణాఫ్రికా, ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022, అక్టోబర్ 30న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు

    ఎక్కడ: ఆప్టస్ స్టేడియం, పెర్త్

    భారత జట్టు: రోహిత్ శర్మ (c), దినేష్ కార్తీక్ (wk), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, రిషబ్ పంత్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్
    దక్షిణాఫ్రికా స్క్వాడ్‌: క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (సి), రిలీ రోసోవ్, ఐడెన్ మార్క్‌రామ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎంగిడి, రీజా హెండ్రిక్స్

    Trending Stories

    Related Stories