బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, అలాగే దర్శకులు వికాస్ బెహల్, అనురాగ్ కశ్యప్…! వీరందరూ మీకు తెలిసే ఉంటుంది. పేరు మోసిన సెలబ్రీటీలు..! ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నైతిక సూత్రాలు.., భావప్రకటన స్వేచ్ఛ… ఉదారవాదం… మైనారిటీల హక్కుల గురించి అదే పనిగా ట్వీటర్ వేదికగా… బాకాలుదేస్తుంటారు. అంతేనా…! వేర్పాటువాదులు.., ఖలిస్తాన్ వాదులు., తుక్డే తుక్డే గ్యాంగులు.., భారత వ్యతిరేక విచ్ఛిన్నకర శక్తులు…, సోకాల్డ్ సెక్యులరిస్టులు… ఆందోళన్ జీవులు…, వీరికి పరమ మిత్రులనే వారు లేకపోలేదు.
పీఎం మోదీ సర్కార్ పై అదేపనిగా విమర్శలు గుప్పిస్తుంటారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల పేరుతో జరుగుతున్న ధర్నాలకు తమ సంఘీభావాన్ని సైతం వ్యక్తం చేస్తుంటారు. చూసే వారికి సైతం..! అబ్బా ఏం సెలబ్రెటీలు బై..! వారికున్న సామాజిక స్పృహ గొప్పది బై…, సెలబ్రెటీలు అంటే ఇలా ఉండాలని అనుకోవడం సహజం.! అయితే వీరి అసలు రూపం మాత్రం వేరేనే ఉంటుందనే వారు లేకపోలేదు.
ఇక అసలు విషయానికి వస్తే… హీరోయిన్ తాప్సీ, తోపాటు దర్శక నిర్మాతలైన మధు మంతెన, అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్ కు చెందిన ఫాంటమ్ ఫిల్మ్స్, టాలెంట్ హంట్ కంపెనీలకు చెందిన ఆఫీసులతోపాటు వారి నివాసాల్లో ఏకకాలంలో ఐటీ రైట్స్ జరిగాయి. పన్ను ఎగవేతలకు సంబంధించి వీరిపై ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.
అయితే వీరిపై ఐటీ రైట్స్ జరగడాన్ని కూడా కొంతమంది సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ వాదులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి పన్నుఎగవేయడం నేరమే కాదనే రేంజ్ లో వారిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సెలబ్రెటీలు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారని.., మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని… వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారని…, రైతుల పేరుతో జరుగుతున్న ఆందోళనలకు అనుకూలంగా ట్వీట్లు చేశారని, అందుకే మోదీ ప్రభుత్వం వీరిని టార్గెట్ చేసిందని.., వారి పన్నుఎగవేతల నేరాన్ని సైతం..జస్టిఫై చేస్తూ.., వారికి అనుకూలంగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మోదీని వ్యతిరేకించే సోకాల్డ్ లిబరల్ సెలబ్రెటీలు ఎన్ని నేరాలు చేసినా .., చూసి చూడనట్లుగా వ్యవహారించాలి కానీ… ఏకంగా ఐటీ రైట్స్ చేస్తారా? అనే రేంజ్ లో ఈ కామెంట్లు సాగుతున్నాయి. అంతేలే..! మోదీని వ్యతిరేకిస్తూ.. మాట్లాడేవారు ఎవరైనా బారా ఖూన్ కరేతో బీ మాఫీ హై..! అన్నట్లుగా ఉంది వీరి తీరు.!