కొత్త ఇన్కమ్ ట్యాక్స్ వెబ్ సైట్ రాబోతోంది..!

0
696

పన్నులు చెల్లించే వారికి సరికొత్త సూచన.. త్వరలోనే కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ రాబోతోంది. జూన్ 7వ తేదీన కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ సైట్ ను తీసుకుని రానున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. అంతకు ముందు ఆరు రోజుల పాటూ వెబ్ సైట్ డౌన్ అయ్యి ఉంటుందని.. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసమే కాకుండా ఎన్నో ఉపయోగాలు ఈ కొత్త వెబ్ సైట్ ద్వారా ఉంటాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలోనే ఈ కొత్త వెబ్ సైట్ రానుంది. కొత్త వెబ్ సైట్ రూపకల్పన కోసం శ్రమిస్తూ ఉన్నందుకు గానూ.. జూన్ 1-6 వరకూ ప్రస్తుతం ఉన్న ఈ-ఫైలింగ్ పోర్టల్ పని చేయదని అధికారులు తెలిపారు.

పాత వెబ్ సైట్ పోర్టల్ అయిన www.incometaxindiaefiling.gov.in ని.. కొత్తగా www.incometaxgov.in మార్చబోతున్నారు. అన్ని పనులు పూర్తీ చేసి జూన్ 7న పోర్టల్ ను మొదలు పెడతామని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోర్టల్ www.incometaxindiaefiling.gov.in జూన్ 1 నుండి 6వ తేదీ వరకూ అందుబాటులో ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు. రాబోయే కొత్త వెబ్ సైట్ యూజర్ ఫ్రెండ్లీ అని అధికారులు వెల్లడించారు.

జూన్ 1 నుండి 6 తేదీల మధ్య వెబ్సైట్ కు సంబంధించి ఎటువంటి వినియోగం ఉండదని.. ముఖ్యమైన అప్డేట్స్ లాంటివి ఏవీ కూడా ఆరోజుల్లో జరగవని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు. ట్యాక్స్ పేయర్లు కొత్త పోర్టల్ కు అలవాటు పడేలా కొద్దిరోజులు సమయం కూడా ఇచ్చామని అన్నారు. “In preparation for the transition to the new system, the existing e-filing portal will not be available to both taxpayers as well as department officers for a period of six days from 1 June to 6 June.” అంటూ నోటీసును అందించారు. కొత్త పోర్టల్ జూన్ 7 నుండి లైవ్ లోకి వస్తుందని తెలిపారు. ఈ వెబ్ సైట్ లో ఈ ఫైలింగ్ మాత్రమే కాకుండా ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు. అధికారులు ఇదే సైట్ ద్వారా నోటీసులు, సమన్లు, షోకాజ్ నోటీసులు.. వంటివి కూడా పంపొచ్చు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here