పండుగపూట పడగవిప్పిన మతోన్మాదం..! రాజస్థాన్, బెంగాల్లో హిందువులపై దాడులు..!!

0
797

సంతోషాల సమాహారమే పండుగ. కొత్త బట్టలు, పిండి వంటలు, విందు భోజనాలు, దైవ ప్రార్థనలు పండుగల్లో ప్రధాన ఘట్టాలు. షికార్లు, సరదాలు పండగల్లో అంతర్భాగం. కుల, మత, వర్గ బేధాలన్నీ మరచి ఆప్యాయంగా, ఆనందంగా గడపడం పండుగ ప్రధాన ఉద్దేశం. అయితే, తమ రూటే సేపరేట్ అన్నట్టు బెంగాల్, రాజస్థాన్ లో ఇస్లాంవాదులు.. హిందువులను దారుణం కొట్టి.. వారి ఆక్రందనలు చూసి పైశాచిక ఆనందం పొంది.. తమ పండుగ నిర్వహించుకున్నారు. వామపక్ష, ఉదారవాద వర్గం.. ఈ నిర్వాకాన్ని మనసారా ఆశీర్వదించింది.

హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో, వారి మనోభావాలు దెబ్బతినే సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు.. ఇప్పుడు దారుణంగా దాడులకు దిగుతున్నారు. టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలు అధికారంలో వున్న చోట హిందువులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయి.

ఇటీవల, రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ లోని పిపాడ్ పట్టణంలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఇస్లాంవాదులు ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో ‘సర్ తన్ సే జుదా’ వంటి దారుణమైన నినాదాలు చేశారు. ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి, గతంలో వివిధ మత హింస కేసుల్లో ప్రమేయం ఉన్న రోషన్ అలీ అనే నిందితుడిని అరెస్టు చేశారు.

మహమ్మద్ ప్రవక్త జయంతి ఊరేగింపు సందర్భంగా ‘సర్ తన్ సే జుదా’ నినాదాలు లేవనెత్తకూడదని ‘ఆల్ ఇండియా ముస్లిం జమాత్’ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరికీ జారీ చేయబడింది. అయితే, జోధ్‌పూర్‌ ఇస్లాంవాదులు తమ సొంత సంఘం ఆదేశాలను ఉల్లంఘించింది. హిందూ ఆధిపత్య ప్రాంతమైన నయాపురా సుభాష్ కాలనీ గుండా ఊరేగింపు వెళుతున్నప్పుడు ‘సర్ తన్ సే జుదా’ వంటి నినాదాలు చేశారు.

కాలనీ వాసులు సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్నారని నేరస్తులపై ఫిర్యాదు చేశారు. ఊరేగింపు ర్యాలీ జరుగుతుండగా, రోషన్ అలీ అనే వ్యక్తి అనుచితంగా వ్యవహరించినట్టు తమకు సమాచారం అందిందని ఎస్‌హెచ్‌ఓ ప్రేమ్‌దన్ రత్నూ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు రత్నూ చెప్పారు.

ఇలాంటి దారుణమైన నినాదాలు వెలుగులోకి రావడం, దారుణ ఘటనలకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. హిందువులపై ద్వేషం పెంచుకుని, హింసకు పాల్పడిన ఘటనలకు సంబంధించిన ఎన్నో కేసులు వున్నాయి. అంతకుముందు జూన్‌లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఇద్దరు వ్యక్తులు ఒక టైలర్‌ను దారుణంగా హత్య చేశారు. ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నామని చెబుతూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. ఇంత జరగినా.. చాలామంది రాజకీయ నాయకులు, కొందరు విదేశీ తొత్తుల్లా ప్రవర్తిస్తున్న కొందరు పాత్రికేయులు కూడా.. ముస్లింల దాష్టికాలపై పల్లెత్తు మాట అనడం లేదు.

ఇస్లాంలో పవిత్రమైన రోజుగా ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పండుగ నిర్వహించుకుంటారు. దయ, కరుణ, ధర్మగుణం, ధార్మిక భావన గురించి మహ్మద్ ప్రవక్త పవిత్ర బోధనలు చేసిన ముఖ్యమైన రోజుగా.. ఈ పండుగను ముస్లింలు నిర్వహించుకుంటారు. ‘ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ’ పర్వదినాన్ని ‘ఈద్-ఎ-మిలాద్’ అని సైతం పిలుస్తారని ముస్లిం సోదరులు తెలియజేస్తున్నారు. ఇది ప్రవక్త ముహమ్మద్ జన్మదినాన్ని సూచిస్తుంది.

తమను తాము సామరస్య బోధకులుగా, శాంతి దూతలుగా అభివర్ణించుకుంటూ.. మైనార్టీలమని చెప్పుకునే ఇస్లాంవాదులు తెల్లారిలేస్తే చాలు.. ఎన్నో దారుణాలు, దాష్టీకాలకు పాల్పడుతున్నారు. పవిత్ర పర్వదినం నాడు.. శాంతి కాముకులు, సహృదయులైన హిందువులపై అకారణంగా దాడులకు దిగడం, అనుచితం వ్యవహరించడం అంటే.. వారి జుగుప్సాకర తీరు ఎలాంటిదో గమనించవచ్చు. బెంగాల్, రాజస్థాన్ ఇస్లాంవాదులు ‘మిలాద్-ఉన్-నబీ’ పండగ రోజున పుణ్యానికి బదులు పాపాన్ని మూటగట్టుకున్నారు. హిందువులను ధూషించి, దాడులకు పాల్పడి.. వీరంగం సృష్టించారు.

రాజస్థాన్ రాష్ట్రం ఇప్పటికే రాజకీయ గందరగోళంలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఎంతో అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో సామాజిక ఐక్యత లోపించి.. అధ్వాన్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో మతపర శతృత్వం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల, కోల్‌కతాలోని ఖిద్దర్‌పూర్-మోమిన్‌పూర్ ప్రాంతంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగింది, అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను ప్రతిపక్ష బీజేపీ నిరసించింది. అయితే, అధికార TMC నిర్లజ్జగా ప్రవర్తించి.. మాటల యుద్ధానికి దిగింది. ఎదురెట్టి చదరంగం ఆడే సామెత మాదిరి ప్రవర్తించి.. అసందర్భపు పేలాపనలను పేలుతోంది.

తప్పులు చేసేవారు తమ స్థాయిని పెంచుకుని దారుణాలు, దాష్టీకాలకు పాల్పడుతుంటే.. రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ.. వారి చేష్టలకు పరోక్ష మద్ధతు తెలియజేస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదని హిందు బంధువులు అంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 5 =