More

    దౌత్య‘నీతి’ లేని పాకిస్తాన్..!
    ఇమ్రాన్ ఇప్పటికైనా మారతాడా..?

    పక్కవాడికి హాని తలపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడికి.. ఎన్ని మంచి విషయాలు చెప్పినా బుర్రకెక్కదు. భారత్ పై విషం కక్కడమే పరమావధిగా వున్న పాకిస్తాన్ కు కూడా అంతే. ఆ ఉగ్రవాద దేశం వేసే ప్రతి అడుగూ భారత్ కు వ్యతిరేకంగానే వుంటుంది. అవలంభించే ప్రతి విధానం భారత్ వ్యతిరేక విధానయే అవుతుంది. ఇలా స్వార్థపూరిత ఆలోచనలతో చేసే పనుల వల్ల పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో పరువు పోగొట్టుకుంది. అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది. కనీసం దౌత్య మర్యాదలను కూడా పాటించకుండా అభాసుపాలవుతోంది. అయితే, భారత్‌ మాత్రం హుందాగా వ్యవహరిస్తూ ప్రపంచ దేశాల మన్ననలు చూరగొంటోంది.

    నిజం మాట్లాడుకోవాలంటే, కశ్మీర్‌ అంశం తప్ప, భారత్, పాకిస్తాన్ లకు ఏ విషయంలోనూ శతృత్వం లేదు. దీనిని కూడా శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకుందామనే.. ఇన్నాళ్లూ భారత్ చెబుతూవస్తోంది. కానీ, ముందే చెప్పుకున్నట్టు.. పాకిస్తాన్ కు మంచి చెవికెక్కదు కదా..! అందుకూ భారత్ సలహాలను విస్మరించి కయ్యానికి కాలుదువ్వుతోంది. కానీ, భారత్ మాత్రం ఎప్పుడూ సంయమనం పాటిస్తూ దౌత్య నీతిని కాపాడుతూవస్తోంది. తాజాగా జరిగి ఓ సంఘటనే ఇందుకు నిదర్శనం. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌ నుంచి కొలంబో వెళ్లేందుకు భారత గగనతలాన్ని ఉపయోగించుకోవాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే భారత గగనతలాన్ని ఉపయోగించుకోవడం తప్ప వేరే వాయుమార్గం లేదు. దీంతో గగనతల అనుమతులు మంజూరు చేయాలంటూ పాకిస్తాన్ భారత ప్రభుత్వాన్ని కోరింది. భారత్‌ కూడా ఎలాంటి ఆంక్షలు విధించకుండా అనుమతులు మంజూరు చేసి పెద్ద మనసును చాటుకుంది. కానీ, ఇదే పాకిస్తాన్ గతంలో మన దేశాధినేతలకు గగనతల అనుమతులు ఇవ్వకుండా కుటిలబుద్ధిని ప్రదర్శించింది.

    2019లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐరోపా పర్యనటకు వెళ్లేందుకు తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్‌ నిరాకరించింది. దీంతో ఆయన చుట్టూ తిరిగి ఐరోపా వెళ్లాల్సి వచ్చింది. అదే ఏడాది సెప్టెంబర్‌ నెలలో ప్రధాని మోదీ సౌదీ ఆరేబియా పర్యటనకు వెళ్లేందుకు సిద్దం కాగా, గగనతలాన్ని వాడుకునేందుకు పాక్‌ ససేమిరా ఒప్పుకోలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు మోదీ అమెరికా వెళ్లేందుకు రెడీ కాగా, మళ్లీ తన గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్‌ నిరాకరించి తన వక్రబుద్దిని చాటుకుంది.

    సాధారణంగా దేశాలమధ్య ఎన్ని విబేధాలున్నా.. శత్రుదేశాలైనా కూడా.. దేశాధినేతల పర్యటనలకు సంబంధించి పరస్పరం గగనతలాన్ని వాడుకుంటాయి. ఇది దౌత్యనీతి. అంతర్జాతీయంగా, శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. దీనిని ఏ దేశం ఉల్లంఘించేంచే ప్రయత్నించదు. కానీ, భారత్‌ పట్ల విద్వేషాన్ని నరనరానా జీర్ణించుకున్న ఉగ్రవాద దేశం పాకిస్తాన్.. ఈ దౌత్యనీతిని విస్మరించి తన కుటిలత్వాన్ని ప్రదర్శించింది. అయినా, భారత్‌ మాత్రం గతాన్ని మరిచిపోయి ఇమ్రాన్‌ పర్యటనకు మన గగనతల అనుమతులు ఇచ్చింది. ఇదే విషయంలో గతంలో భారత్ కు నో చెప్పి.. మళ్లీ మన గగనతలాన్ని కోరడం పట్ల పాక్ కొంచెమైనా సిగ్గుపడాలి. కానీ, ఎలాంటి సిగ్గూ, ఎగ్గూ లేకుండా అడిగేసింది పాకిస్తాన్. భారత్ కూడా గతాన్ని పట్టించుకోకుండా గగనతలం అనుమతులిచ్చి.. ఇప్పటికైనా దౌత్యనీతిని గౌరవించమంటూ చెప్పుతో కొట్టినట్టు చెప్పింది.

    అయితే, కుటిలబుద్ధిని ప్రదర్శించిన పాకిస్తాన్ కు శ్రీలంక సైతం తగిన గుణపాఠం చెప్పింది. భారత్ పెద్ద మనసుతో గగనతల అనుమతులిచ్చినా.. శ్రీలంక మాత్రం ఇమ్రాన్ ను తమ దేశానికి రానివ్వలేదు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఇమ్రాన్‌ పర్యటనలో శ్రీలంక పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. కానీ ఈ సందర్బంగా కశ్మీర్‌ విషయాన్ని ప్రస్తావిస్తారన్న అనుమాంతో ఏకంగా కార్యక్రమాన్నే రద్దుచేసింది శ్రీలంక. భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో విధంగా వ్యవహరించింది.

    నిజానికి, విదేశీ పర్యటనల్లో ఆయా దేశాల పార్లమెంటులో ప్రసంగించడం దేశాధినేతలకు అత్యంత గౌరవం. భారత ప్రధానులు, రాష్ట్రపతులు గతంలో ఎన్నో దేశాల పార్లమెంటుల్లో ప్రసంగించారు. యూరోపియన్ పార్లమెంట్, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సభల్లో సైతం ఉపన్యాసం చేశారు. 1962లో భారత తొలి ప్రధాని నెహ్రూ,.. 1973లో ఇందిరాగాంధీ, 1979లో మొరార్జీ దేశాయ్ ఈ గౌరవాన్ని పొందారు. అంతేకాదు, రాజీవ్ గాంధీ, మన్మోహన్ తో పాటు.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అలాంటి గౌరవం దక్కింది. గతంలో దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలా యూరోపియన్ పార్లమెంటులో ప్రసంగించిన సందర్భాలు కూడా వున్నాయి. గతంలో పాకిస్తాన్ ప్రధానుల కూడా విదేశీ పార్లమెంటులో ప్రసంగించిన సందర్భాలున్నాయి. 1963లో ఆయూబ్‌ ఖాన్‌, 1975లో జుల్ఫికర్ ఆలీభుట్టో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. కానీ, ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం ఈ గౌరవానికి నోచుకోలేదు. 2015లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించగా.. అదే శ్రీలంకతో ఛీకొట్టించుకుని ఇమ్రాన్ ఖాన్ తన పరువు పోగొట్టుకున్నాడు. కనీసం దౌత్య మర్యాదలు కూడా తెలియని ఉగ్రవాద దేశాధినేత.. ఇతర దేశాల నుంచి దౌత్య మర్యాదలు ఆశించడం సిగ్గుచేటు. అయినా, భారత్ ఏనాడూ దౌత్యనీతిని తప్పలేదు. పాకిస్తాన్ పై ఎలాంటి శతృత్వం చూపించకుండా పెద్ద మనసును చాటుకుంది. చాటుకుంటూనేవుంది. ఈ విషయం ఇప్పటికైనా ఇమ్రాన్‌కు అర్థమవుతుందంటారా..?

    Trending Stories

    Related Stories