More

  ఇమ్రాన్ ఖాన్ మంచి రోజులు ముగిసినట్లేనా..?

  స్థానిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. పార్టీకి బలమైన కోటగా భావించే ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పెషావర్ (ఖైబర్ పఖ్తుంక్వా రాజధాని) మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) విజయం సాధించింది. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా రాష్ట్రంలోని గిరిజన జిల్లాల విలీనం తర్వాత PTI కు భారీగా దెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల తొలి విడతలో చాలా ప్రాంతాల్లో పీటీఐకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. JUI-F భారీ తేడాతో PTI పెషావర్ మేయర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. JUI-F పార్టీ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్‌కు జుబైర్ అలీ 62,388 ఓట్లు పొందారు. దాదాపు 11,500 ఓట్ల తేడాతో పీటీఐ అభ్యర్థి రిజ్వాన్ బంగాష్‌పై విజయం సాధించారు. రిజ్వాన్ బంగాష్‌కు 50,669 ఓట్లు రాగా, పీపీపీకి చెందిన జరాక్ అర్బాబ్‌కు 45,000 ఓట్లు వచ్చాయి.

  ఇమ్రాన్ ఖాన్ అధికార పార్టీ ఎనిమిదేళ్లుగా పాలించిన ప్రావిన్స్‌లో ఇప్పుడు ఓటమిని అందుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ప్రజాదరణ క్షీణిస్తోందనడానికి సంకేతమిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాయువ్య ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో మేయర్‌లు, ఇతర స్థానిక ప్రభుత్వ అధికారులను ఎన్నుకోవడానికి జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు 21 స్థానాలను గెలుచుకోగా, ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ఆరు స్థానాలను గెలుచుకున్నట్లు స్థానిక ఎన్నికల సంఘం ప్రతినిధి సోహైల్ అహ్మద్ తెలిపారు.

  ఖైబర్ ఫక్తుంఖ్వాలో పీటీఐ ఓటమిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. పీటీఐ తప్పు చేసిందని, దాని కోసం మనం బాధపడ్డామని ఆయన అన్నారు. ‘ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన స్థానిక ఎన్నికల తొలి విడతలో తప్పు చేశాం, లోపాలను చవిచూశాం.. తప్పుడు అభ్యర్థులను ఎంపిక చేయడమే మా పరాజయానికి పెద్ద కారణం. రెండో దశ ఎన్నికల విషయమై అలాంటి తప్పేమీ చేయమని.. ఇన్షా అల్లా PTI విజయాన్ని నమోదు చేస్తుంది’ ఇమ్రాన్‌ ఖాన్ ట్వీట్‌ చేశారు.

  Trending Stories

  Related Stories