More

    తనపై కాల్పులకు తెగబడింది వారేనంటున్న ఇమ్రాన్ ఖాన్

    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే..! ఇమ్రాన్ ఖాన్ తనపై కాల్పుల వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా ముగ్గురి ఆదేశాల మేరకే తనపై ఈ దాడి జరిగిందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వసిస్తున్నారని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సీనియర్ నేతలు గురువారం తెలిపారు. “కొద్దిసేపటి క్రితం, ఇమ్రాన్ ఖాన్ తన తరపున ఈ ప్రకటనను విడుదల చేయమని మాకు చెప్పారు. ఈ దాడి ఎవరి ఆదేశానుసారం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ నమ్ముతున్నాడంటే- షెహబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్.” అని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకులు అసద్ ఉమర్, మియాన్ అస్లాం ఇక్బాల్ అన్నారు. రాణా సనావుల్లా పాకిస్థాన్ అంతర్గత మంత్రి, మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్.

    ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పీటీఐ నేతలు తెలిపారు. పిటిఐ ప్రధాన కార్యదర్శి అసద్ ఉమర్ ఆ ముగ్గురిని వారి పదవుల నుండి తొలగించాలని కోరారు. “ఇమ్రాన్ ఖాన్ ప్రమాదంలో ఉన్నారని మాకు నివేదికలు అందుతున్న సమయంలో నేను ఇమ్రాన్ ఖాన్‌తో మాట్లాడాను. ఈ విషయాన్ని మనం అల్లాకు వదిలివేయాలని ఆయన అన్నారు. ఈ ముగ్గురిని వారి పదవుల నుండి తొలగించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఈ వ్యక్తులను తొలగించకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయి” అని ఆయన అన్నారు. ‘‘ఇమ్రాన్‌ఖాన్‌ కాలికి బుల్లెట్‌ తగిలింది.. సీటీ స్కాన్‌ చేశారు. ఈ జాతి స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఇమ్రాన్‌ ఖాన్‌ పదే పదే చెబుతూ వచ్చారని.. ఎవరికైనా చిన్న సందేహం ఉంటే ఈ ఘటనతో నివృత్తి అవుతుంది” అన్నారాయన.

    Trending Stories

    Related Stories