More

    ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య వాహనంపై కాల్పులు.. ఆయన మీదనే విమర్శలు

    పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని రెహమ్ ఖాన్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్తాన్ పిరికిపందలు, దుండగులు, అత్యాశ పరుల దేశంగా మారిందని ఆమె విమర్శలు గుప్పించారు.

    జనవరి 3న రెహమ్ ఖాన్ తన మేనల్లుడి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తన వాహనంపై కాల్పులు జరిపారని, తుపాకీతో బెదిరించారని ట్వీట్‌లో తెలిపారు. ‘నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా కాల్పులు జరిగాయి. మోటార్ బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినప్పుడు కారులో నా వ్యక్తిగత వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ కొత్త పాకిస్థాన్ ఇదేనా? పిరికివాళ్లు, దుండగులు, అత్యాశతో కూడిన స్థితికి వచ్చేశామని.. జనవరి 2- జనవరి 3 మధ్య రాత్రి ఈ ట్వీట్ పోస్ట్ చేయబడింది. కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని ఆమె చెప్పారు. కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని, భయంతో వెహికిల్స్‌ మారిపోయానని, అదృష్టవశాత్తూ తన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఆమె చెప్పారు. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ షామ్స్‌ కాలనీ(ఇస్లామాబాద్‌) పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

    తనకు ఏమి జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తన మాతృభూమి కోసం బుల్లెట్ గాయాలకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. ఆమె మాట్లాడుతూ, “నేను పాకిస్తాన్‌లో సగటు పాకిస్థానీలా జీవించి చనిపోవాలని ఎంచుకుంటాను. ఇది పిరికిపంద లక్ష్యంగా జరిగిన దాడి. జంట నగరాల ప్రధాన రహదారిపై ఇలాంటి ఘటనలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి! నా మాతృభూమి కోసం, నేను బుల్లెట్ తీసుకోగలను!” అని చెప్పుకొచ్చారు.

    రెహమ్ ఖాన్ ఎవరు?

    రెహమ్ ఖాన్ బ్రిటిష్-పాకిస్థానీ మూలాలు ఉన్న జర్నలిస్ట్. ఆమె పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కొంతకాలం వివాహం చేసుకుంది. జర్నలిస్ట్, మాజీ టీవీ యాంకర్ అయిన రెహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ 2014లో వివాహం చేసుకున్నారు అప్పటినుంచి 2015 అక్టోబర్ 30వ తేదీ వరకు కాపురం చేసి ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ నుంచి విడిపోయారు. పది నెలల తర్వాత విడాకుల కోసం దాఖలు చేసింది. 2018లో ఆమె విడుదల చేసిన ఆత్మకథలో రెహమ్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు చేసింది. పాక్ ప్రధానికి వ్యతిరేకంగా కొన్ని వాదనలు చేసింది. ఆమె తన ఆత్మకథలో ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసింది. రెహమ్ ఖాన్ అనేక సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్‌ను ‘నకిలీ మనిషి’ అని ‘అధికారం కోసం ఏదైనా చేసే వ్యక్తి’ అని పిలిచింది. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ దేశ సైన్యం చేతిలో కీలుబొమ్మ అని కూడా విమర్శించింది.

    Trending Stories

    Related Stories