పాక్ కు ఐఎంఎఫ్ ఆర్థిక సాయం..! మరి రానున్న రోజుల్లో పరిస్థితేంటి..?

0
876

అనుకున్నదే జరిగింది. అంతర్జాతీయ బిచ్చగానిపై ఐఎంఎఫ్ దయ చూపింది. ఉగ్రవాద దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ భారీ రుణం ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్‌ పై ఐఎంఎఫ్ కనికరం చూపింది. పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్ల మేరకు రుణం మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా వెంటనే 1 బిలియన్ డాలర్లను ఆ దేశం అందుకునేందుకు మార్గం సుగమం ఆయింది. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ క్రింద 1 బిలియన్ డాలర్లను వెంటనే విడుదల చేయడానికి 6వ సమీక్షను పూర్తి చేయాలని ఐఎంఎఫ్‌ను పాకిస్థాన్ కోరింది. దీంతో ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలి వాషింగ్టన్ డీసీలో సమావేశమై, ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి షౌకత్ తరిన్ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. పాకిస్థాన్‌ కోసం ఐఎంఎఫ్ రుణ వితరణ ప్రోగ్రామ్‌లో 6వ విడత భాగాన్ని ఆ సంస్థ బోర్డు ఆమోదించినట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ఆయన తెలిపారు.

2019 జూలైలో ఐఎంఎఫ్, పాకిస్థాన్ సిబ్బంది స్థాయిలో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మూడేళ్ళపాటు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కోసం ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం 39 నెలల్లో దాదాపు 6 బిలియన్ డాలర్లు పాకిస్థాన్‌కు అందుతుంది. పాకిస్థాన్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ఐఎంఎఫ్ ఈ రుణ సహకారాన్ని అందిస్తోంది. అయితే ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ పొందేందుకు ఉగ్రవాద దేశం సాహసం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఆర్థిక సాయమే రేపు ఆ దేశం కొంప ముంచనుంది. IMF డిమాండ్లను నెరవేర్చడానికి పన్నులను పెంచడానికి ప్రభుత్వం ఒక చిన్న-బడ్జెట్‌ను రూపొందించడానికి కట్టుబడింది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. IMF డిమాండ్లను ఒప్పుకొంటూ ఇమ్రాన్ ఖాన్ PTI నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవల ఫైనాన్స్ బిల్లు 2021, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ సవరణ బిల్లు 2021ని అమలులోకి తెచ్చింది.

ఈ బిల్లును ప్రవేశ పెట్టడం వల్లే అంతర్జాతీయంగా $1 బిలియన్ సహాయం పొందేందుకు మార్గం సుగుమం అయ్యింది. అయితే ఆ బిల్లు నిర్ణయాన్ని పాక్ లోని ఇతర పార్టీలు, పలువురు నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అలా చేయడం వలన పాక్ రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అయినా కూడా పాక్ ప్రభుత్వం అప్పు కోసం అనుకున్న పని చేసింది. ఇప్పుడు రుణం దొరికిందని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నా.. రానున్న రోజుల్లో ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం లేకపోలేదని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల పాక్ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − thirteen =