More

    ఏపీకి సూపర్ సైక్లోన్ ముప్పు లేదు: ఐఎండీ

    బంగాళాఖాతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడనుందని, అది క్రమేపీ బలపడి పెను తుపానుగా మారనుందని కథనాలు వచ్చాయి. దీనిపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) స్పందించింది. సూపర్ సైక్లోన్ గురించి జరుగుతున్న ప్రచారం వట్టి పుకారు మాత్రమేనని.. ఆ తుపానుకు ‘సిత్రాంగ్’ అని నామకరణం చేసినట్టు వస్తున్న వార్తల్లోనూ నిజంలేదని పేర్కొంది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.మహాపాత్ర మాట్లాడుతూ.. బంగాళాఖాతంలో సూపర్ సైక్లోన్ ఏర్పడుతుందని, అది భారత తీరాన్ని తాకుతుందని వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. సూపర్ సైక్లోన్ కు సంబంధించి తాము ఎలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.

    Trending Stories

    Related Stories