14 ఏళ్ల బాలికను రెండు రోజులు బంధించి నరకం చూపించిన ఇమామ్

0
744

50 ఏళ్ల ఇమామ్.. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అతడు 14 సంవత్సరాల బాలికను రెండు రోజుల పాటూ బంధించి అత్యాచారం చేశాడు. పలు మార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో 14 ఏళ్ల మహిళా మదరసా విద్యార్థినిని రెండు రోజుల పాటు బంధించాడు ఆ ఇమామ్..! ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చండినా తీర్చర్‌లోని మసీదులో ఇమామ్ గా ఉన్న అబుల్ బషర్ ప్రాథమిక విచారణలో తన నేరాలను ఒప్పుకున్నాడు. అతన్ని ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) సోమవారం అర్థరాత్రి సదర్ దఖిన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్ మీడియా నివేదించినట్లుగా ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ కి చెందిన కమాండర్ మేజర్ ఎండీ సకీబ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ బషర్ జూలై 22 మరియు 23 తేదీలలో బాలికను బందీగా ఉంచాడు. ఆమెను రెండు రోజుల పాటూ అత్యాచారం చేసిన తర్వాత బషర్ ఆ బాలికను తన సోదరుడి వద్ద వదిలేసి పారిపోయాడు. అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. మైనర్ తండ్రి బషర్‌పై ఫిర్యాదు నమోదు చేయడంతో పోలీసులు అతడిని పట్టుకోడానికి ప్రయత్నాలను ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం నాడు అతడు దొరికాడు. బషర్‌ ఆ అమ్మాయికి అరబిక్ బోధిస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. కానీ అతడు మాత్రం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రాథమిక విచారణలో బషర్ బాలికను మోసగించి తన ఇంటికి తీసుకుని వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. ఆమెపై అత్యాచారం చేసినట్లు కూడా అతను ఒప్పుకున్నాడు.

బంగ్లాదేశ్ లో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు:

గత ఏడాది నవంబర్‌లో అత్యాచారానికి ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసినప్పటికీ, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు మాత్రం తగ్గడం లేదు. గత ఐదేళ్లలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా 26,695 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఇటీవల విడుదల చేసిన పోలీసు ప్రధాన కార్యాలయ నివేదిక ద్వారా తెలుస్తోంది. గత ఏడాదిలోనే కనీసం 1,018 మంది పిల్లలు అత్యాచారానికి గురయ్యారని, కానీ కేవలం 683 పోలీసు కేసులు మాత్రమే నమోదయ్యాయని కొన్ని రిపోర్టులు తెలిపాయి. వీరిలో ఆరు సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు 116 మంది ఉన్నారు. గత సంవత్సరం మొత్తం 1,627 అత్యాచార కేసులు నమోదయ్యాయి, ఇందులో 53 మంది మహిళలు నేరస్థులచే చంపబడ్డారు, 14 మంది తమ ప్రాణాలను తీసుకున్నారు. ప్రస్తుత సంవత్సరం మొదటి 6 నెలల డేటా ప్రకారం బంగ్లాదేశ్ లో 532 అత్యాచారాలు, 139 గ్యాంగ్ రేప్‌ లు జరిగాయి. చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారని.. లేదంటే ఈ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయని సర్వే చేస్తున్న బృందాలు కూడా వెల్లడించాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here