National

అడ్డంగా బుక్కయిన తాప్సీ అండ్ గ్యాంగ్..!

ఐటీ శాఖ దాడులు చేస్తే గానీ అసలు రంగు బయటపడలేదు. సినిమాల ద్వారా నిత్యం నీతులు, భావ ప్రకటనా స్పీచ్ లు.. తెరవెనుక మాత్రం ట్యాక్స్ లు ఎగ్గొట్టే విధానాలు.

తాజాగా తాప్సీ అండ్ గ్యాంగ్ పై ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ దాడులు చేసిన విషయం విధితమే. రెండ్రోజుల సెర్చ్ ఆపరేషన్ పూర్తి చేశాక తాప్సీ పన్ను, అనురాగ్ కశ్యప్ లకు సంబంధించి కోట్లాది రూపాయల ఇల్లీగల్ ట్రాన్ జాక్షన్స్ ను గుర్తించింది ఐటీ శాఖ.
ఐ-టి అధికారులు తమ దర్యాప్తులో తాప్సీ పన్నూ 5 కోట్ల రూపాయల నగదు రశీదులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ యొక్క అధికారిక నివాస ప్రాంగణంపై దాడి చేసిన దర్యాప్తు సంస్థ, డైరెక్టర్ యొక్క ఇల్లీగల్ ట్రాన్ జాక్షన్స్ కు సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపారు.
ఐటి విభాగం మీడియా ప్రకటనలో ఈ విషయాలను పూర్తిగా వివరించారు. తాప్సీ ఫోన్ నుండి కొంత డేటా తొలగించబడిందని అధికారులు అనుమానిస్తున్నారు. డేటాను తిరిగి పొందేందుకు నిపుణుల సహాయం తీసుకోబోతున్నారు. మొత్తం 5 కోట్ల రూపాయల లావాదేవీలు అనుమానాస్పదం అని తేలింది. Taapsee’s endorsement deals మరియు film signing amounts ఇప్పుడు ఐటి శాఖ స్కానింగ్ లో ఉన్నాయి.
క Phantom Films వాటాదారులు సుమారు 600 కోట్ల రూపాయల ఆదాయపు పన్ను ఎగవేతలు ఉన్నట్లు బలంగా అనుమానిస్తున్నారు. ఫాంటమ్ ఫిల్మ్స్ యొక్క వాటా అమ్మకం నుండి వారు సంపాదించిన డబ్బు నుండి వాటాదారులు ఆదాయపు పన్ను చెల్లించలేదని తెలుస్తోంది.
ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ వెల్లడిస్తున్న వివరాలు పూర్తి వైరుధ్యంగా చట్ట బద్దంగా లేవని తెలిపారు. సుమారు 300 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారులు వెల్లడించలేకపోయారు.
అసలు ఈ డబ్బు వీరికి ఎలా వచ్చింది..?
సినిమాల ద్వారా గడించినదా? లేక
హవాలా మార్గాలలో వచ్చిందా..? వస్తే అది ఎక్కడి నుంచి..?
ఇలా చాలా విషయాలు తేలాల్సి ఉంది.
మరో వైపు కొందరు లెఫ్ట్ లిబరల్ సూడో మేధావులు, జర్నలిస్టులు ఈ వ్యవహారాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. జాతీయంగా కొన్ని మీడియా ఛానళ్లతో పాటు గా తెలుగు నాట కొన్ని పత్రికలు కూడా ఇదే తరాహాలో వ్యవహరిస్తుండడం విడ్డూరం.
ప్రముఖ పత్రికలో వచ్చిన కార్టూన్ నే చూడండి. అందులో వక్రీకరణ ఎలా చేశారో తెలుస్తుంది.
ఢిల్లీలో ఖలిస్తానీ ప్రేరేపిత రైతు ఉద్యమానికి మద్దతు పలికినందుకే కేంద్రం ప్రభుత్వం వీరిపై ఐటీ దాడులు చేసింది అని అర్ధం వచ్చేలా పిచ్చిగీతాలు గీసారు.
ఇది నిజంగా మన దేశంలో ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఒక బలమైన వ్యవస్థ ఐటీ శాఖను అవమానపరిచినట్లే.
సరే వారన్నదే నిజమైతే.. దాడులు జరిగాక వెల్లడవుతున్న నిజాల పరిస్థితి ఏమిటి..?
నటి తాప్సీ ఎందుకు తన 5 కోట్ల రూపాయలకు లెక్క చెప్పలేకపోయింది.. ప్రాధమిక విచారణలో తేలిన వివారాల ప్రకారం ఎందుకు తన ఫోన్ లో కొంత డేటా డిలీట్ చేయబడింది.
ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి..?
ఇక ఫాంటమ్ ఫిల్మ్స్ 350 కోట్ల రూపాయల కనీస వివరాలను ఎందుకు ఇవ్వలేకపోతోంది..?
సదరు కార్టూనిస్ట్, ఆ పత్రిక దీనికి సమాధానం చెప్పగలదా..?
ఇలా అసంబద్ధ, అసత్య కధనాలు ప్రచురించే వార్తా పత్రికల పట్ల, మీడియా పట్ల జనం జాగరూకత వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

seventeen − 7 =

Back to top button